ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు త్వరలో ఏడు వందే భారత్ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 14 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. ఇదే సమయంలో మరో 31 రైళ్లను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 45 అందుబాటులో వస్తాయి. న్యూఢిల్లీ వారణాసి, చెన్నై మైసూరు, బిలాస్ పూర్ నాగ్ పూర్, సికింద్రాబాద్ విశాఖపట్నం, ముంబై సెంట్రల్ షోలాపూర్, ముంబై సెంట్రల్ సాయినగర్ ముంబై సెంట్రల్ షిరిడీ ల మధ్య నడుస్తున్నాయి.


అదే విధంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది. వచ్చే ఆగస్టు 15 వ తేదీ నాటికి మొత్తం 75 రైళ్లను నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త గా వచ్చే 31 రైళ్లలో 7 కొత్త వాటిని తెలంగాణ, ఆంధ్రకు కేటాయించారు. సికింద్రాబాద్ -ఫుణే, విజయవాడ- చెన్నై,  తిరుపతి - విశాఖపట్నం, కర్నూల్ - బెంగళూరు, చెన్నై సెంట్రల్ - హైదరాబాద్, నర్సాపూర్ - విశాఖపట్నం, నర్సాపూర్ - గుంటూరు మార్గంలో వందే భారత్ కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిని వచ్చే ఆగస్టు 15 తేదీ నాటిని  ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రవేశపెట్టారు.


అలాగే దేశ వ్యాప్తంగా ప్రముఖ పట్టణాల నుంచి వివిధ ప్రాంతాలకు మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వందే భారత్ రైలులో సౌకర్యాలు విలాసవంతంగా ఉంటాయి. ఎక్కువ దూరానికి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. తద్వారా సమయం ఎంతో ఆదా అవుతుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కువ చోట్ల ఆగదు. ఇది కొన్ని ముందుగానే నిర్ణయించిన పెద్ద జంక్షన్లలో ఆగుతుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ వల్ల తిరుపతి, విశాఖ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇకపై తొందరగా వెళ్లొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: