చంద్రబాబుపై కోపంగా తీసుకువచ్చిన చట్టమో, హెరిటేజ్ కంపెనీ ని దెబ్బ కొట్టాలని తీసుకొచ్చిన చట్టమో కానీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. హెరిటేజ్ కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక పాల డైరీలు అన్నింటిని దెబ్బ కొట్టుకుంటూ వచ్చారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అప్పుడు వాటిని ప్రభుత్వ సహకార రంగంలో ఉన్న వ్యక్తులకు ఇచ్చేశారని తెలుస్తుంది. తద్వారా అవన్నీ హెరిటేజ్ కే పాలు సప్లై చేయడం ద్వారా హెరిటేజ్ బాగా వృద్ధి చెందింది.


దానిపైన గతంలో రాజశేఖర్ రెడ్డి గాని, ఇప్పుడు జగన్ గాని విమర్శిస్తూ ఉండే వారు. జగన్ వచ్చాక దాన్ని మార్చడానికి చూస్తే సాధ్యం కాలేదు. కోర్టులో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది తీసుకోవడానికి కుదరదని కోర్టులు చెప్పేసాయి.ఇక నెక్స్ట్ ఫేజ్ లో అమూల్ ని తీసుకొచ్చి హెరిటేజ్ కి పోటీగా నిలబెట్టారు. తద్వారా జనాలకి పాల ప్యాకెట్ రేట్లు పెరిగాయి తప్ప వాళ్ళకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. రైతులకు ఒక రూపాయి లాభం అయితే వచ్చింది. కానీ హెరిటేజ్ ని అయితే అమూల్ దాట లేకపోయింది. దాంతో జగన్ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా కనిపిస్తుంది.


పాలను కల్తీ చేస్తే జైలు పాలు, పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం అమలుకి బాధ్యత పశుసంవర్ధక శాఖదే అని నిర్ణయించారు. మిల్క్ ఎనలైజర్ ఉంటే లైసెన్సులు తీసుకోవాల్సిందే. పాల సేకరణలో నాణ్యత పాటించకపోతే డైరీ ఆస్తుల జప్తు, ఐదు లక్షల వరకు జరిమానా, ఐదు ఏళ్లపాటు కారాగార శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు.


ఇవి సాధారణంగా ఎవరైతే హెరిటేజ్ కి పాలు పోస్తూ అమూల్ కి పాలు పోయరో వాళ్లపై ఈ చట్టాల్ని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.  అదే సందర్భంలో ప్రతీకార రాజకీయాలని తెలుగుదేశం విమర్శిస్తున్న సందర్భంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జరిగేది అదే అంటున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: