ఇండియాలో అల్లకల్లోలం సృష్టించి రైతు ఉద్యమం పేరుతో అరాచకాలు చేసిన వారు, ఖలిస్థాన్ వేర్పాటు వాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం అలజడులు సృష్టించి అనంతరం వివిధ దేశాలకు పారిపోయిన వారిపై భారత్ గుర్రుగా ఉంది. వారందరి లిస్ట్ తయారు చేసి వీరు ఎక్కడ జీవిస్తున్నారో ఆయా దేశాలకు వివరాలను పంపింది.


ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఖలిస్తాన్ వేర్పాటు వాద సిక్కులు ఉంటున్నారు. వీరి పూర్తి వివరాలతో ఎక్కడ అల్లర్లకు పాల్పడ్డారు. వీరెంతమంది ఉన్నారు. ఏమేం అరాచకాలు చేశారో ఆధారాలతో సహా ఆయా దేశాలకు ఇండియా అప్పజెప్పింది.


దీంతో అమెరికా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 17 మందిని  అరెస్ట్ చేసింది. ఇందులో ఖలిస్థాన్ కు సపోర్టు చేస్తున్న వారే ఉండటం గమనార్హం. వీరి వద్ద ఏకే 47 తుపాకులు, 42 పిస్టోళ్లు దొరకడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. 17 మందికి అమెరికా లో జరిగిన పలు కాల్పులు, అల్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అమెరికా భారత్ పంపిన లిస్టుకు స్పందించి చర్యలు తీసుకోవడం గమనార్హం. 11 కాల్పుల ఘటనలో 17 మంది సిక్కులను అరెస్టు చేసిన అమెరికా ఆపరేషన్ బోపెన్ సోర్స్ పేరుతో ఈ చర్యలు చేపట్టింది.


ఈ నిందితులంతా ఉత్తర కాలిపోర్నియాకు చెందిన వారని వీరికి మాఫియా తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలు హత్యలకు సంబంధించి భారత్ పంపిన జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని చెప్పింది. హింసాత్మక ఘటనలతో పాటు, 5 హత్య కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడైతే ఇండియాలో దాడులు చేసి పారిపోయి విదేశాలకు వెళ్లారో వారి వివరాలు ఆ దేశాలకు తెలియజేయడంతో అమెరికా ఈ చర్యలు చేపట్టింది. కాబట్టి ఒకప్పటి లాగా విదేశాలకు పారిపోయారని ఊరుకోకుండా వారిని ఇండియాకు రప్పించేలా కేసులు నమోదు చేయించేలా భారత్ పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: