
రష్యాపై ఒత్తిడి తేవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇండియా ఒకే మాట మీద నిలబడింది. అమెరికా, యూరప్ దేశాలు మరో ఎత్తుగడకు రంగం సిద్ధం చేశాయి. ప్రస్తుతం నాటో దేశాలు,యూరప్ దేశాలతో స్నేహంగా ఉండే దేశాలతో రష్యా మీద ఆంక్షలు పెట్టాలని అమెరికా, యూరప్ దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టి సొంత ప్రజలతోనే చీవాట్లు తింటున్నారు. ఇలాంటి ఒత్తిడులను ఆయా దేశాలు నిరాకరిస్తున్నాయి. తాజాగా సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ ను స్వీడన్ దేశం రష్యాపై ఆంక్షలు విధించాలని కోరింది. దీన్ని సెర్బియా ప్రెసిడెంట్ తోసిపుచ్చారు.
స్వీడన్ నాటో దేశాల్లో భాగం. ఇది 1999 లో సెర్బియాపై దాడి చేసింది. ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ఉండమని మాకు సూచిస్తోంది. సెర్బియా ఎలా ఉండాలో స్వీడన్ చెబితే వినే పరిస్థితిలో లేము. మేం న్యూట్రల్ గానే ఉంటున్నాం. దాన్ని కొనసాగించానుకుంటున్నాం. మాకు ఎవరితో వైరుద్యాలు లేవు, పెట్టుకోవాలని మేం అనుకోవడం లేదని సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ అన్నారు. రష్యా పై ఆంక్షలు విధించి ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నా యూరప్ దేశాల తీరు ఇంకా మారకపోవడం విచిత్రమే.