హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సంఘం పేరుతో ఇటీవల ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన అవుట్ డేటెడ్ పొలిటిషన్ అయినా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వడం, ఆయన మంచి పాయింట్లు, సర్వేలు రిలీజ్ చేయడంతో ఆయన మీద అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే ఆ మధ్యన జనసేన పార్టీ తో ఆయనకు సమావేశం కూడా జరగడం అయితే అయ్యింది.


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం ఆయన రాజకీయాలు లో సైలెంట్ అయ్యారు. ఆయన ఎండింగ్ లో చూసుకుందాం అన్నారు కాబట్టి అది ఎండింగ్ లోనే జరిగే అవకాశం ఉంది. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ ఇంకా జనసేన పార్టీ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పడం అయితే జరిగిందట. అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి అసలు వెళ్ళద్దని చెప్తున్నారట ఆయన.


తెలుగుదేశం పార్టీపై జనాలకి నమ్మకం లేకపోవడం, జగన్ పట్ల వ్యతిరేకత ఉండటం, సరిగ్గా ఈ సమయంలోనే, ఈ సందర్భాల్లోనే భారతీయ జనతా పార్టీ ఇంకా జనసేన అధినేత కలిసి సగం సగం సీట్లలో పోటీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్తున్నారట. ఆయన తెలుగుదేశానికి కలిసి వచ్చే అంశాల గురించి చెప్తూ మీడియా మద్దతు ఇంకా 14 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లాభిస్తాయి అని చెప్పారట. అయితే అవినీతి ఆరోపణలు, కులముద్ర రంగా హత్య ఆరోపణల్లాంటివి  పార్టీని వెంటాడుతున్నాయని  చెప్తున్నారు.


ఆయన చెప్పేది ఏంటంటే అయితే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలి, తెలుగుదేశం పార్టీతో వెళ్లొద్దు అని ఆయన చెప్తున్నారు.. ఒకవేళ లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమని అనుకుంటే మాత్రం తెలుగుదేశం ఇంకా జనసేన ఇద్దరు కలిసి సగం సగం సీట్లలో పోటీ చేయాలంటున్నారు. కానీ దానికి టిడిపి ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: