కేసీఆర్ కుమార్తె కవిత ఈమెని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇంకా సిబిఐ ఇద్దరు కూడా పిలిచి మరీ విచారణ చేయడం జరిగింది. అయితే దీనిపై, ఇలా విచారణ చేయడంపై ఇది బిఆర్ఎస్ పై కుట్ర అని, కేసీఆర్ని కూలదోసేందుకు చేసిన ప్రయత్నం అంటూనే దానికన్నా ముందే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలను కొనబోతున్నారని ఫామ్ హౌస్ లో దానికి సంబంధించిన బేరాలు జరుగుతున్నాయి అన్నట్లుగా చెప్పి నలుగురిని అరెస్టు చేయడం కూడా జరిగింది.


అలా వీళ్ళు డైరెక్ట్ గా అమిత్ షా ని, ఇంకా బిఎల్ సంతోష్ ని కూడా టచ్ చేయడానికి చూసినట్లుగా తెలుస్తుంది. అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మేరకు ఆగడం, ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ వచ్చాక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను అరెస్ట్ చేయడం, రిమాండ్ రిపోర్టులు, హైదరాబాదులో చర్చలు జరిగాయి, పంజాబ్ లో చర్చలు జరిగాయని మాటలు వచ్చాయి.


రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఉండడం చూసి కవితని ఈడి ఇంకా సిబిఐ వాళ్ళు విచారణకు పిలవడం, కవిత అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని చెప్పడం, ఆమె తాను కూడా సిద్ధమని అనడం, ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఉద్యమాలు చేయడం, ఆ తర్వాత దానిపై టీవీ లో వరుస పెట్టి స్క్రోలింగ్ అవుతూ ఉండడం ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి.


సిబీఐ, ఇంకా ఈడిలు అడగాల్సిన ప్రశ్నలు అయిపోయాయని, చివర్లో కవిత కొన్ని సెల్ ఫోన్లు తీసుకువెళ్లి ఇచ్చిందని ఈడి అయితే దానిపై నోరు మెదపడం లేదని, సిబీఐ కూడా నోరు మెదపడం లేదని, అలాగే కవిత కూడా సైలెంట్  అయిపోయిందని అనుకుంటుండగా, కపిల్ సిబాల్ తాజాగా సుప్రీంకోర్టులో కవిత విషయంలో ఏం జరిగిందన్నది వివరించారు. అరెస్టు సమయంలో స్టే గురించి అడిగితే ఇవ్వలేదని ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చారు ఆయిన.


మరింత సమాచారం తెలుసుకోండి: