పాకిస్థాన్ ప్రభుత్వానికి హిజ్బుల్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఈ హిజ్బుల్ ముజాహీదిన్ సంస్థ కాశ్మీర్ లో అనేక దాడులు చేసింది. కాశ్మీర్ లో ఉన్న ఆర్టికల్ 370, 35 లు రద్దు చేయడం వల్ల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కాశ్మీర్ లో నూ వర్తిస్తున్నాయి. అక్కడ దేశంలో ఉన్న ఎవరైనా భూములు కొనుక్కొవచ్చు. గతంలో ఇలాంటి హక్కులు ఇతర భారతీయులకు ఉండేవి కావు.


కాశ్మీర్ లో భూమి కొనడానికే వీలు ఉండేది కాదు. పోలీసు చట్టాలు అమలయ్యేవి కావు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలకు అందాల్సిన నిధులు అందడం లేదు. పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దొంగనోట్లు, డ్రగ్స్ సరఫరా లాంటి ఎన్నో రాకుండా అడ్డుకట్ట వేసినట్లయింది. ప్రస్తుతం కాశ్మీర్ చాలా ప్రశాంతంగానే ఉంటోంది.


ఇలాంటి సమయంలో హిజ్బుల్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే కాశ్మీర్ లో ఇండియా ఇష్టారీతిన వ్యవహరిస్తుంది. అక్కడ కాశ్మీరీలకు ఉన్న ప్రత్యేకాధికారాలను తీసేశారు. పాక్ ప్రభుత్వం, ఆర్మీ చూస్తూ ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. పాక్ మాజీ ఆర్మీ చీఫ్ బాజ్వా మాట్లాడుతూ.. కాశ్మీర్ ను భారత్ నుంచి తీసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం పాక్ లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.


ఇలాంటి సమయంలో భారత్ తో గనక పెట్టుకునే పరిస్థితి ఏ మాత్రం లేదు. కనీసం యుద్ధ ట్యాంకుల్లో పెట్రోల్, డిజీల్ పోసే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో హిజ్బుల్ ముజాహీద్ సంస్థ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కాశ్మీర్ కోసం మేం పోరాటం చేస్తుంటే మీరు అలా ఎలా మాట్లాడతారని బాజ్వాపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: