ఉక్రెయిన్ చైనా మీద ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మొన్ననే చైనా అధ్యక్షుడు జింపింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి వచ్చాడు. కాబట్టి పుతిన్ ని కలిసినట్టే తనను కూడా కలుస్తారేమోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు చైనా అధ్యక్షుడిని రమ్మని పిలిస్తే జింపింగ్ మాత్రం పర్వాలేదు నేను ఫోన్లో మాట్లాడుతానని చెప్పారట. అయినా సరే రమ్మని చెప్తే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి అన్నారట ఆయన. అదే విధంగా ఇప్పుడు జింపింగ్ నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ వచ్చిందని తెలుస్తుంది.


వీళ్ళిద్దరి చర్చల్లో తేలింది ఏంటంటే ముఖ్యంగా జింపింగ్ చెప్పింది ఏమని అంటే, శాంతి సామరస్యాలు ముఖ్యమైనవి కాబట్టి ఇప్పుడున్న స్థితిని యధాతధంగా కొనసాగిద్దాం అని అన్నారట. ఇప్పుడున్న స్థితిని యథాతథంగా కొనసాగిద్దాం అంటే అర్థమేంటంటే  ఇప్పటికే ఉక్రెయిన్ కి సంబంధించిన డొనేట్ స్కీ, లోపాన్ స్కీ, జెపోరీజియా, కేర్సన్, బాగ్ పుత్ అద్వైక లాంటి ప్రాంతాలన్నీ రష్యా ఆధీనంలోకి వచ్చేసాయి.


అంటే వాటిని అలాగే ఉంచేసి మిగిలిన ఉక్రెయిన్ ప్రాంతాలతో ఉండమని చెప్పడం ఆయన మాటలకు అర్దం అని తెలుస్తుంది. అంటే ఇది ఒక రకంగా కాల్పుల విరమణ అవుతుంది. కాల్పుల విరమణ అనే విషయానికి వస్తే ఇక్కడ ఉక్రెయిన్ దేశం ఓడిపోయినట్లుగా అయిపోతుంది లేదా తనకు మిగిలి ఉన్న ప్రాంతాలను నడుపుకుంటూ ఉండాలి. ఆ ప్రాంతంలో ఇదివరకు ఆయన ఈజీగా గెలిచాడు.


కానీ ఇప్పటికే ఆయన్ని నోటికి వచ్చినట్టు తిట్టుకుంటున్నారని, ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఉక్రెయిన్ లో జరుగుతున్న  భయంకరమైన యుద్ధ వాతావరణం వల్ల పరిస్థితులు అస్తవ్యస్తమయ్యి, తినడానికి తిండి లేక చివరికి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, తలదాచుకోవడానికి ఇతర దేశాలకు పారిపోయారని తెలుస్తుంది. ఈ దశలో అక్కడ ప్రజల్లో హీరో అవ్వాలనుకుంటున్న  జెలెన్స్కి  చైనా అధ్యక్షుడు జింపింగ్  చెప్పిందే జరిగితే హీరో కాదు కదా వాళ్ళందరికీ విలన్ అవుతాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: