తెలుగు నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. అనేక పార్టీలకు చెందిన నాయకులు ఆయా పార్టీల తరపున కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కలిసి పాల్గొంటున్నారు. నిన్న, ఇవాళ, రేపు, మూడు రోజులపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కర్ణాటక ఎన్నికలల్లో ప్రచారం చేస్తారు.


ఈ మూడు రోజుల్లో 11 బహిరంగ సభల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. నిన్న ఉదయం హైదరాబాద్‌ నుంచి కర్ణాటక వెళ్లిన రేవంత్‌ రెడ్డి బీదర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి బహిరంగ సభలకు బయలుదేరి వెళ్లారు.  హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బీదర్‌ వెళ్లిన రేవంత్‌ రెడ్డికి స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి ఖర్గేతో కలిసి వెళ్లిన ఆయన బీదర్‌ బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.


అక్కడ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెలికాప్టర్‌లో బసవకళ్యాణ్‌ చేరుకుని అక్కడ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అక్కడ నుంచి యాద్గిరి, గురు మిట్కల్‌ల్లో జరిగే బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. నిన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాలబురగిలో బస చేశారు. ఈ  ఉదయం కలబురిగి నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరి అలంద చేరుకుని అక్కడ బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హాజరవుతారు.


అక్కడ నుంచి చించోలి, ముదోల్‌ లల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు. రేపు నాలుగో తేదీన కాలబురిగి నుంచి షోరాపూర్‌, అక్కడ నుంచి యాద్గిరి, అక్కడ నుంచి గురుమిత్కల్‌ చేరుకుని బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి తిరిగి రోడ్డు మార్గాన కాలబురగి చేరుకుంటారు...అక్కడ నుంచి రోడ్డు మార్గాన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ బయలు దేరతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: