భారత్‌, రష్యా మధ్య వ్యాపార సంబంధాలు అయితే ఉన్నాయి గాని, ఆ వ్యాపారంలో కూడా ఆయిల్ కి సంబంధించిన వ్యాపారం కంటే, ఆయుధాలకు సంబంధించిన వ్యాపారమే ఎక్కువగా జరిగుతుందని తెలుస్తుంది. గోధుమలు, పప్పులు, ఉప్పులు ఇలాంటివి కూడా రష్యా దగ్గర కొనడం చాలా తక్కువ. రష్యా దగ్గర భారత దేశం 0.2 శాతం మాత్రమే ఆయిల్ ని కొంటుందని తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా తక్కువ రేటుకు వ్యాపారాలను సాగిస్తుంటే దానితో మనం వ్యాపారాలు పెంచుకున్నామని తెలుస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి, గోధుమలు, పప్పులు, ఉప్పులు లాంటి నిత్యవసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి, యూరియా ధరలు కూడా విపరీతంగా పెరిగి పోయాయి. ఒక బస్తా యూరియా  రైతులకి 2000 కి 3000 రూపాయల ధరకి ఇస్తే, భారత ప్రభుత్వం బయట నుండి కొంటె మళ్ళీ 2 వేలు, 3 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని, అదే రష్యా దగ్గర కొంటే 3 వేలు  రూపాయలకే యూరియా బస్తా వస్తుందని, అప్పటికి రెండున్నర వేల రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడని తెలుస్తుంది.


ఇప్పుడు రష్యాతో భారత్ సాగిస్తున్న వ్యాపారం ఒక హైయెస్ట్ రికార్డుగా నిలిచిందని అంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా మరియు భారతదేశం మధ్య వాణిజ్యం చారిత్రకంగా ఎంతో బలపడింది. రష్యా నుండి భారతదేశానికి ఎగుమతులు గత భౌతిక సంవత్సరంలో మొదటిసారిగా నలభై బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం నుండి రష్యా నుండి భారతదేశానికి ముడి చమురు నివేదికల పరిమాణం పెరగడం వల్ల మాస్కో మరియు న్యూఢిల్లీ మధ్య వాణిజ్యంలో విపరీతమైన పెరుగుదల అనేది కనిపించింది. రష్యా కూడా భారతదేశానికి ఐదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఇప్పటివరకు పదో స్థానంలో ఉన్నటువంటి భారత్ రష్యాల మధ్య వ్యాపారం ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: