రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అవసరమైతే యుద్ధంలో తాను దిగుతానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గతంలోనే  ప్రకటించారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పై దాడి జరిగింది. దీనిపై రష్యా అధికార వర్గాలు పుతిన్ ను చంపడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.


దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. కీవ్ నుంచి పరారై ఎక్కడో దాక్కున్నడనే ప్రచారం జరుగుతోంది. కీవ్ లో ఉండే జెలెన్ స్కీ ప్రస్తుతం అక్కడ కనిపించడం లేదు. రహస్య ప్రాంతంలో అతి తక్కువ మంది సన్నిహితులకు తెలిసిన ప్రదేశంలో దాక్కున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే జెలెన్ స్కీ ఇప్పుడే కాదు గతంలో యుద్ధం ప్రారంభమైన సమయంలో వివిధ ప్రాంతాల్లో దాక్కున్నట్లు తెలుస్తోంది.


ఈ మధ్య అమెరికాలోని పెంటగాన్ లో లీకైన రహస్య డేటా తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. అంటే జెలెన్ స్కీ ఒక్క సారి కాదు పలు సార్లు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లు రుజువైంది. జెలెన్ స్కీ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా సార్లు రహస్య ప్రాంతాల్లో దాక్కున్నారు.  అయితే ఉక్రెయిన్ లో  రోజు రోజుకు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు వారం రోజుల్లోనే లక్ష మంది దాకా చనిపోయినట్లు తెలుస్తోంది.


దీంతో అమెరికాపై ఉక్రెయిన్ ఆగ్రహంతో ఉంది. రష్యాను ఏం చేయలేకపోతున్నారని మండిపడుతోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాలకు గతంలో లెక్కలు చెప్పేది. ప్రస్తుతం ఆ లెక్కలు కూడా చెప్పడం లేదు. కొన్ని సార్లు అమెరికా ప్రతినిధులకు స్పందించడం లేదు. గతంలో అమెరికా ఇచ్చిన ఆయధాలు ఏ ప్రాంతంలో ఉపయోగించారు. ఎన్నింటిని వాడారు.. ఏమేం ఉపయోగించారు. తదితర వివరాలను అమెరికాకు చెప్పేవారు. కానీ ఉక్రెయిన్ లో ఇంతమంది చనిపోతున్న అమెరికా  పట్టించుకోకపోవడంపై ఉక్రెయిన్ అధికార వర్గాలు కోపంతో రగిలిపోతున్నట్లు అందుకే స్పందించడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: