భారత దేశంలో ఉండి ఇక్కడి తిండి తిని ఇక్కడే పుట్టి పాకిస్థాన్ కు సపోర్టు చేసే వారు చాలా మంది ఉన్నారు. తీవ్ర వాదులకు మద్దతు తెలిపే వారు ఉన్నారు. దాడి విషయంలో ఎమోషనల్ గా జరిగిపోయిందని అనే వారు ఉన్నారు. కానీ పాకిస్థాన్ లో అలా కాదు. అందరికీ ఇండియా మీద కోపం ఉంటుంది. తిండికి లేకపోయిన యుద్దం చేయడానికి ఇండియాను ఎలాగైనా నాశనం చేయాలనే ఏకాభిప్రాయం ఉంటుంది.


ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలోఅయిదుగురు వీర జవాన్లు మరణించారు. దీన్ని పాకిస్థాన్ కు చెందిన మాజీ దౌత్యధికారి అబ్దుల్ బాసిత్ సమర్థించారు. కశ్మీర్ అనేది పాకిస్థాన్ లో భాగం అని అక్కడ ఇండియా కు చెందిన ఆర్మీ అధికారులు తమ ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఇలాంటి దాడి జరగడం సహజమని అన్నారు.


అంటే ఉగ్రదాడిని  పాకిస్థాన్ కు చెందిన నాయకులు సమర్థిస్తున్నారని అర్థమవుతుంది. పాకిస్థాన్ లో కశ్మీర్ లో అంతర్భాగమని దాని కోసం వారు పోరాడుతున్నారని తీవ్రవాదులకు మద్దుతుగా పాక్ మాజీ దౌత్యవేత్త మాట్లాడారు. కానీ భారత్ లోనే ఇలాంటి దాడుల పట్ల ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. కొన్ని పౌర సంఘాలు, కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తుంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై విషం చిమ్మే మాటలు ఇండియాలోనే మాట్లాడుతుంటారు.


దాన్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేసే వారు ఉన్నారు. అలాంటి వారి వల్ల ఇండియాలో ఐక్యత కొరవడుతోందన్న విమర్శలు ఉన్నాయి. దేశ భక్తి లేక పక్కవాడు గొప్ప వాడని కీర్తించే వారు ఉన్నంత వరకు ఇండియాలో ఐక్యత అనేది ఉండదు. దేశం కోసం పోరాటం చేసే వారిని గౌరవించడం.. కశ్మీర్ మనదేనన్న భావన పెంపొందించుకోవాలి. అక్కడ ఏ సైనికుడికి గాయామైన మన ఇంట్లో వారికి అయినట్లుగా భావించినపుడే దేశ భక్తి అందరి హృదయాల్లో నిలిచిపోతుందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: