
2013లో తెలంగాణ వస్తే సమ్మెలు ఉండవన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఇపుడు ఉద్యోగులపై నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా చూస్తున్నదని ఆర్.ఎస్. ప్రవీణ్ మండిపడ్డారు. 2018లో మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్ లో హామీ ఇస్తేనే... 9600 మంది ఉద్యోగంలో చేరారని ఆర్.ఎస్. ప్రవీణ్ గుర్తు చేశారు.
ప్రభుత్వం మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేయకుండా... దానికోసం కమిటీ వేయకుండా క్యాడర్ స్ట్రెంత్ నిర్దారించకుండా... అక్రమంగా మరో ఏడాది ప్రొహిబిషన్ పెంచారని ఆర్.ఎస్. ప్రవీణ్ తెలిపారు. ఈ సంవత్సరం కూడా పూర్తయిందని కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. దీంతో అందరూ పంచాయతీ కార్యదర్శులు రోడ్లపైకి వచ్చి సమ్మెలు చేస్తున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ తెలిపారు. వారికి బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినా... ప్రభుత్వం మాత్రం విఆర్ఏలు, ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి ఉద్యోగుల మీద ఎలాగైతే ఉక్కుపాదం మోపారో... వీరి మీద కూడా ఉక్కుపాదం మోపి అణచివేయాలని చూస్తున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు.
ఉద్యోగంలో చేరేముందు ఎలాంటి సమ్మెలు, యూనియన్లు, సంఘాలు పెట్టుకోమని... చెప్పినట్టే వింటామని బాండ్ పేపర్ రాసిచ్చారని... కాబట్టి సమ్మె చేయొద్దని నోటీసులో పేర్కొన్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ తెలిపారు. పల్లెప్రకృతివనం, హరితహారం, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు పని చేయించుకొని మోసం చేశారని ఆర్.ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు.