రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత అతి పెద్ద విజయం అంటే బాగ్ పుత్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడమే. అంతకుముందు లూహన్ స్కీ, జెపోజెజారియా, కేర్సన్ లాంటి ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు బాగ్ పుత్ ప్రాంతంలో సైనిక చర్య వేగంగా చేపడుతోంది. బాగ్ పుత్ లో మొత్తం రష్యా స్వాధీనం చేసుకుంది.


ఈ విజయానికి కారణం వ్యాగనర్ గ్రూప్. ఈ విషయంలో మిగతా ప్రాంతాల కంటే పూర్తిగా ఆధిపత్యం బాగ్ పుత్ ప్రాంతంలో సాధించింది. ఈ వ్యాగనర్ గ్రూప్ అనే రష్యా సైనిక సంస్థ ఉక్రెయిన్ సైనికులను చంపేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఉక్రెయిన్ కు ఇప్పుడు మెరుగైన ఆయుధాలు వస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు ఎక్కువగా అధునాతన ఆయుధాలు ఇస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైనికులు మళ్లీ బాగ్ పుత్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.


అయితే ఈ వ్యాగనర్ సైన్యం రష్యా ప్రభుత్వాన్ని మెరుగైన ఆయుధాలు పంపాలని కోరింది. అమెరికా అధునాతన ఆయుధాలతో ఫైట్ చేస్తోంది. మాకు కూడా అధునాతన ఆయుధాలు ఉంటే మెరుగ్గాా పోరాడవచ్చని కోరింది. కానీ రష్యా మాత్రం ఇప్పటికీ పాత ఆయుధాలతో బాగ్ పుత్ ప్రాంతంలో పోరాడాలని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని సూచించింది. దీంతో వ్యాగనర్ సైన్యం తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది. అయితే ఆ ఆయుధాలతో తాము యుద్దం చేయలేమని వ్యాగనర్ గ్రూప్ చెప్పి మరీ ఆయుధాల వీడియోలను రష్యాకు పంపింది.


24 గంటల్లో నూతన ఆయుధాలు ఇవ్వకపోతే వెళ్లిపోతామని చెప్పింది. దీంతో రష్యా బాగ్ పుత్ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. బాగ్ పుత్ ప్రాంతం నుంచి వ్యాగనర్ సైన్యం వెనక్కి వెళ్లిపోతుంటే చెచెన్యా సైన్యాన్ని ఈ బాగ్ పుత్ ప్రాంతంలో రష్యా మోహరించింది. వ్యాగనర్ సైన్యం మాత్రం వెనక్కి వెళ్లిపోవడం మాత్రం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR