విద్యార్థి ప్రతిభకు కొలమానం పరీక్షలు అని తెలిసిన విషయమే. అక్షరాల పొందిక, విషయ అవగాహన, సబ్జెక్టుపై పూర్తి పట్టు, రాసే విధానం, అక్షరాల సౌందర్యం, పూర్తి స్థాయిలో పట్టు ఉందా లేదా అనేది  గమనించాల్సిన విషయం. అయితే ఇప్పడు 600 మార్కులకు 600 మార్కులు వేస్తున్నారు. ఇది ఎలా వేస్తున్నారో ఎవరికీ అర్థం కానీ విషయం ఎందుకుంటే సోషల్ లాంటి సబ్జెక్టులో 100 కు 100 మార్కులు రావడం అనేది చాలా కష్టమైన అంశం. ఎవరో ఏమో అనుకుంటారని మార్కులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.


ఇది వరకు ఇంటర్మీడియట్ చదివే సమయంలో 100 మార్కులకు 50 మార్కులు, 60 మార్కులు రావాలంటేనే కష్టపడేది. అవి వస్తేనే గొప్ప. ఇప్పుడు 600 మార్కులను 500 లోపు వస్తేనే ప్రతిభ ఉన్నట్లు అంతకంటే తక్కువ మార్కులు వస్తే అవి మార్కులే కానట్లు చెబుతున్నారు. తమిళనాడులో ఒక విద్యార్థినికి 600 మార్కులకు 600 మార్కులు వచ్చాయి.


ఇదెలా సాధ్యం. విద్యార్థి ప్రతిభను తక్కువ అంచనా వేయకున్నా.. కచ్చితంగా అన్ని సబ్జెక్టులో మార్కులు ఎలా వస్తాయో అంతు పట్టడం లేదు. మాస్టర్లు దీని గురించి చెప్పగలరా.. తెలుగు, సోషల్ లాంటి సబ్జెక్టుల్లో 100 కు 100 మార్కులు వస్తున్నాయి అంటే నిజంగా మెచ్చుకోదగిందే.. మార్కులు వేసే సమయంలో విద్యార్థులు, విద్యా సంస్థలు ఫీల్ అవుతాయని ఎక్కువ గనక వేస్తే మాత్రం ఇప్పటికైనా మార్చుకోవాల్సిందే .


ఎందుకంటే ఇలా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఆ అంచనాలను అందుకోలేక భవిష్యత్తులో ఢీలా పడిపోతున్నారు. నిజంగా అన్ని మార్కులు సాధిస్తే సంతోషించాల్సిందే. కానీ అది సత్యనిరూపితంగా ఉండి విద్యార్థి భవిష్యత్తుకు రాచ మార్గంగా ఉండాాలి. ప్రతి సబ్జెక్టు పై పూర్తి పట్టు ఉండటం విద్యార్థికి అవసరం. కానీ టెన్త్ ఇంటర్ తర్వాత వారు ఇదే విధమైన ధోరణిలో ఎందుకు ఉండలేకపోతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: