వాస్తవం చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు మన దగ్గర చాలామంది ఉంటారు. అలాగే ఆ అభిమానించే వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్లు కూడా ఎక్కువమంది ఉంటారు. అంతే కాదు జూనియర్ ని కుటుంబ సభ్యులు వదిలేసినా, వాళ్ల వల్ల ఇబ్బంది పడినా కూడా వీళ్లు ఒక అన్నలా, ఒక కుటుంబ సభ్యుల్లా, తల్లితండ్రుల్లా జూనియర్ కి మేమున్నామని చెప్తున్నారు.


అది నిజమైన అభిమానం. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఈ మధ్యన జరుగుతున్న అవమానాల గురించి, ఆయన ఎదుర్కొన్న బాధల గురించి అభిమానులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పేరుకే పెద్ద కుటుంబం. కాని చిన్ననాటి నుండి తను ఒంటరి వాడే. తాను నమ్మింది ఒకటే. అదే అతన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది. అదే స్వయంకృషి, అతని స్వయంకృషి. అవసరం వస్తేనే గాని మొహం చూడని కుటుంబ పెద్దలు, పెళ్లికి పిలిచి అవమానించిన బంధుగణం ఎదురెదురు వచ్చిన పట్టించుకోని మనుషులు అతని వారు.


అయిన వాడికి ఆకులో కాని వారికి కంచంలో పెట్టే వంశ పెద్దలు. ఎంత అవమానపరిచిన తన అవసరం ఉందని చెప్పిన ప్రతి సారీ ముందుకు వచ్చాడు. చావుకి ఎదురొడ్డి మరీ వాళ్ళ కోసం తాపత్రయ పడ్డాడు. అయినా అతనికి దానివల్ల ఏం కలిసి వచ్చింది. ఆయన స్పందిస్తే పిల్ల కాకి అని తెర వెనుక కుట్రలు. స్పందించకపోతే అదిగో చూశారా ఇతను మనవాడు కాదు అని. ఇలా అతను ఏం చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పే.


ఒక ముక్కలో చెప్పాలంటే తన ఎదుగుదల వీళ్ళకి అడ్డంకి. ఎవరు ఎన్ని మాటలు అన్నా తీవ్ర  పరిణామాలు అని హెచ్చరించినా తన గుండెల్లో ఆ బాధను దాచుకున్నాడు తప్ప బయటపడింది లేదు. తను నమ్మింది కృషి. ఆయనే మాకు ఋషి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్ట్ చేశారు. అతని వెంట మేము ఉంటామని చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: