నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని కొంతమంది ప్రముఖ ఉపాధ్యాయుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్నో రకాల పేర్లతో కనిపిస్తున్న పాఠశాలల బోధనా విధానాల రూపకర్తలు వీరంతా. సరైన వనరులు లేనప్పుడే వీళ్లు పిల్లలను పాఠశాలకు రప్పించే విధంగా వారిలో ఆసక్తి పెంచే విద్యావిధానాన్ని రూపొందించి అందరి మన్ననలు అందుకున్నారు. వారి గురించి ఒక్కరిగా తెలుసుకుందాం..

ఫెడరిక్ ఫోబెల్, ఇతను ఇప్పుడు మనకు కొత్తగా వినిపిస్తున్న కిండర్ గార్డెన్ కు పునాది వేసిన వారు. ఇటివంటి కొత్త విధానం ఆయన మొదటిగా రూపొందించి, పిల్లలకు ఆటలు, పాటల ద్వారా విద్య నేర్పించ వచ్చు అని నిరూపించారు. అదే తన లక్ష్యంగా ఆయన కృషి చేసి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మార్గరెట్ మెక్ మిలన్, ఈమె కూడా విద్యార్థుల కోసం కృషి చేసిన వారిలో చెప్పుకోదగ్గవారు. ముఖ్యంగా పేద పిల్లలకు ఉచిత విద్య, వసతి, భోజనం, వైద్యం వంటివి అందించడంలో ప్రయాసపడ్డారు. అలాగే ప్రతి పాఠశాలలో క్లినిక్ ఉండితీరాలి అని ఆమె తీవ్రంగా ప్రచారం చేశారు. ఈమె వయోజన ట్రైనీ లకు ట్రైనింగ్ సెంటర్ మరియు పిల్లలకు నర్సరీ పాఠశాల ఏర్పాటు చేశారు.

జార్జ్ ఆర్వెల్, ఈయన ప్రముఖ నవలా రచయిత. అయితే దానికంటే ముందు ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఒక పిల్లవాడికి బోధన ద్వారా తన స్వశక్తితో బ్రతకటం, బ్రతికించడం వంటివి చేసినప్పుడే ఆయా ఉపాధ్యాయులు సఫలీకృతం అయినట్టు అని ఈయన నమ్మేవారు. ఆయన బోధనా విధానాలు కూడా అదే పంధాలో ఉండేవి.  

ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి ఉపాధ్యాయ వృత్తి ఎంతగానో అవసరం. అయితే అన్ని ఈ వృత్తితోనే చేయాల్సిన పనిలేదు, కానీ అదే ప్రయోజనాలు పొందవచ్చు అని ఎందరో రాజులను తయారు చేసిన అరిస్టాటిల్ కూడా చరిత్రలో ఓ గొప్ప ఉపాధ్యాయుడుగా నిలిచిపోయాడు.

రాండి పౌష్, ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈయన విద్యార్థులకు ఓటమి భయం ఉండరాదని, అనుభవాలతోనే విజయావకాశాలు పెరుగుతాయని బోధించారు. ఒకవైపు కాన్సర్ తో బాధపడుతూనే ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఈయన కృతకృత్యుడయ్యాడు. లక్ష్యాలను సాధించడంలో అన్నిటిని మరిచిపోవాల్సిన అవసరం లేదని, కుటుంబం తదితర విషయాలను గమనించుకుంటూనే విజయ తీరాలు చేరవచ్చని ఈయన వారిని ప్రోత్సహించారు.

జైమ్ ఎస్కలాంటే, ఈయన విద్యార్థులపై చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావం చూపకుండా తన బోధనలతో వారిని ఉత్తేజపరుస్తూ భోదన పట్ల వీరికి ఉన్న అంకిత భావాన్ని చాటి చెప్పారు. వీరి బోధనా విధానాలతో విద్యార్థులు తమ తమ పరీక్షలలో ఉతీర్ణులైన కారణంగా ఈయనకు జాతీయ పురస్కారం కూడా దక్కడం విశేషం.

క్రీడా రంగంలో శిక్షణ ఇవ్వడం కూడా ఒక ఉపాధ్యాయ వృత్తే అవుతుంది. ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో జిమ్ వల్వనో సఫలీకృతులయ్యారు. ఆయన తన విద్యార్థుల నుండి అంకితభావం తప్ప మరొకటి ఆశించేవారు కాదు. అది ఉంటె, ఎంతటి లక్ష్యాన్ని అయినా సాదించ వచ్చని వారికి ఎంతో ప్రేరణ ఇచ్చేవారు. ఈయన కూడా కాన్సర్ బాధితులైనప్పటికీ క్రుంగి పోకుండా తన విద్యార్థులకు విజయ తీరాలు దగ్గర చేయడంలో కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు.

నెల్సన్ మండేలా, అతి పిన్న వయసులోనే తన జాతిపై జరుగుతున్న అకృత్యాలను తట్టుకోలేక ఉద్యమ బాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ పోరాటాల వలన విద్యకు దూరమై జైలు పాలైనప్పటికీ, తిరిగి విద్యాబ్యాసాన్ని సాగించారు. జ్ఞానమే అన్నిటికి పరిష్కారం చూపిస్తుందని ఆయన నమ్మారు. అప్పటి నుండి ఉద్యమాలు శాంతి యుతంగానే చేశారు. దాదాపు 30 ఏళ్ళ పాటు ఈయన జైలు జీవితం గడిపారు.

మార్టిన్ లూథర్ కింగ్, ఈయన జాతివివక్ష రూపుమాపాలని అనేక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంలో వీరు వారి జాతి విముక్తి కోసమే కాకుండా ప్రపంచంలో వివక్షకు గురి అవుతున్న వారందరికీ ప్రతినిధిగా నిలబడ్డారు. దీనితో ఆయన ప్రసిద్ధి చెందిన నాయకుడిగా రుపొందారు. జీవిత పోరాటాలలో రాటుతేలి అత్యున్నత నాయకులుగా రూపొందిన అతి కొద్ది మంది చరిత్ర కారులలో ఈయన ఆద్యుడు అని చెప్పవచ్చు.  

వీరంతా ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రపంచానికి బోధలు చేయకపోయినప్పటికీ, నేటికీ వీళ్లు ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటూ, ఎందరినో తీర్చిదిద్దుతూనే ఉన్నారు. అందుకే ప్రతి నాయకుడూ ఒక ఉపాధ్యాయుడే అనేది సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: