ఈ దేశంలో మనకు ఎప్పటికీ పట్టి పీడించే సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం కూడా ఒకటి. అయితే ఎందరో సంవత్సరానికి డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు అందుతున్నాయా అంటే సమాధానం లేని ప్రశ్నే. ఇప్పటికే కోట్లల్లో యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే భారత ప్రభుత్వం మెల్ల మెల్లగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు అలాంటి శుభ వార్త ఒకటి వచ్చి నిరుద్యోగులకు వరంలా మారింది. మరి ఆ శుభ వార్త ఏమిటో? ఏ సంస్థలో ఉద్యోగాలు అన్నవి చూద్దాం.

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని ఉద్యోగాలను విడుదల చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఆర్బీఐ.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించినటువంటి సర్వీసెస్ బోర్డ్ నిరుద్యోగులు కొరకు ఈ కీలక ప్రకటనను ప్రకటించింది.  ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 303 ఖాళీలను కలిగి ఉన్నట్లు ప్రకటించగా ఆ ఖాళీలను ఇపుడు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత , ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 28 నుండి అభ్యర్ధన అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.  

అదే విధంగా ఏప్రిల్ 28 కి దరఖాస్తులకు ఆఖరి తేదిగా ప్రకటించారు.  అంటే నెల రోజుల వరకు అప్లికేషన్ కోసం సమయం ఇవ్వబడినది. ఈ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు చక్కటి అవకాశం అందించాలని RBI ఈ కీలక ప్రకటనను విడుదల చేసినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నించే వారికి ఇదో చక్కటి అవకాశం , కావున ఆసక్తి గల అభ్యర్దులు వెంటనే అప్లై చేసుకోండి. అలాగే సమాచారాన్ని సదరు అర్హత గల అభ్యర్ధులకు తెలియచేయండి. ఇంకా పూర్తి వివరాల కోసం ఆర్బీఐ అధికారిక సైట్ ను సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: