భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఘజియాబాద్ యూనిట్/ CRL ఘజియాబాద్ కోసం కాంట్రాక్ట్ ద్వారా 63 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇంకా ట్రైనీ ఇంజనీర్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 06, 2022. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, bel-india.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇక ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు కింద వున్నాయి.


BEL ప్రాజెక్ట్ ఇంజనీర్ & ట్రైనీ ఇంజనీర్ ఖాళీ వివరాలు

పోస్ట్: ట్రైనీ ఇంజనీర్-I
మొత్తం పోస్టులు: 37
జీతం: 30,000/- (నెలకు)

పోస్ట్: ప్రాజెక్ట్ ఇంజనీర్-I
మొత్తం పోస్ట్‌లు: 26
జీతం: 40,000/- (నెలకు)


అర్హత ప్రమాణం:

ప్రాజెక్ట్ ఇంజనీర్: AICTE ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి ఫుల్ టైం BE/ B.Tech ఇంజనీరింగ్ (4 సంవత్సరాలు) కోర్సులో సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో కనీసం 55% మార్కులు & కనీసం 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు

ట్రైనీ ఇంజనీర్: AICTE ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి ఫుల్ టైం BE/ B.Tech ఇంజనీరింగ్ (4 సంవత్సరాలు) కోర్సులో సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో కనీసం 55% మార్కులు & కనీసం 01 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు


దరఖాస్తు రుసుము:స్టేట్ బ్యాంక్ కలెక్షన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.

ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం: 500/-

ట్రైనీ ఇంజనీర్ కోసం: 200/-

SC/ST/PWD అభ్యర్థులు: దరఖాస్తు రుసుము లేదు


ఎలా దరఖాస్తు చేయాలి:ఆసక్తి ఉన్న అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.


BEL రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: మార్చి 23, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 06, 2022


ఎంపిక ప్రక్రియ: సంబంధిత అర్హత, పని అనుభవం ఇంకా అలాగే ఇంటర్వ్యూలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక ఉంటుంది

BEL రిక్రూట్‌మెంట్ 2022: నోటిఫికేషన్: bel-india.in

కాబట్టి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BEL