ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో (RBK) ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ , సిల్స్ బోర్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్ 437, హార్టికల్చర్‌ అసిస్టెంట్ 1644, సిల్క్‌ అసిస్టెంట్ 22 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2103 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా త్వరలో భర్తీ చెయ్యనున్నారు.ఇక అలాగే 6వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో కూడా దాదాపు 10 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో అభ్యర్థులను నియమించనున్నారు. దీనిలో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో నియమంచే ఉద్యోగాలు జిల్లా కోర్టుల్లో ఖాళీలుగా గుర్తించారు. 


రాష్ట్ర హైకోర్టులో కూడా పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటికి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. నవంబర్ 11, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. అభ్యర్థుల  వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు.


ఇంకా అలాగే రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలకు psc.ap.gov.inను సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: