SSC టెన్త్ అర్హతతో ఆర్మ్డ్ ఫోర్సెస్లో 24,369 కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ తదితర సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్తో పాటు, ఎన్ఐఏ, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల రిక్రూట్మెంట్కు ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష నిర్వహిస్తోంది. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్  ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అర్హత విషయానికి వస్తే..గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సిపాయి పోస్టుకు రూ.18,000- నుంచి రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700- నుంచి రూ.69,100 మధ్య జీతం చెల్లిస్తారు.దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి.


సిలబస్ విషయానికి వస్తే..జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ఉంటుంది. ఇందులో అనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, ఓరియెంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, ఆబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్లు, అర్థమెటిక్ రీజనింగ్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థిమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ డికోడింగ్ల నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది.ఇంకా జీకే ఉంటుంది. ఇందులో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కరెంట్ ఎఫైర్స్తోపాటు అభ్యర్థి జనరల్ అవేర్నెస్ను పరీక్షించే స్థాయి ప్రశ్నలు ఇస్తారు. భారత్ పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫి, ఎకానమి, జనరల్ పాలిటీ, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతికత, పరిశోధనలు వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇందులో సంఖ్యావ్యవస్థ, పూర్ణాంకాలు, దశాంశాలు, భిన్నాలు, ప్రాథమిక గణిత ప్రక్రియలు, పర్సంటేజీలు, నిష్పత్తి అనుపాతం, లాభ నష్టాలు, వడ్డీ, డిస్కౌంట్, కాలం-దూరం, కాలం-నిష్పత్తి, కాలం-పని తదితర బేసిక్ గణిత అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు 4 నుంచి 10 వరకు అకడమిక్ బుక్స్ ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో అభ్యర్థికి ఉన్న అవగాహన స్థాయిని పరీక్షిస్తారు. బేసిక్ కాంప్రహెన్షన్పై ప్రశ్నలు ఉంటాయి. ఆసక్తి ఇంకా అర్హత కలిగిన వారు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

SSC