కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. నాగ్‌పుర్‌లోని పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్‌ ఈ నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది.మొత్తం దేశ వ్యాప్తంగా కూడా వివిధ ప్రాజెక్టు పనుల్లో ఇంజినీర్ ఇంకా అలాగే సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఇక ఇందులో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మీరు చదివి తెలుసుకోండి.ఇక ఈ పోస్టులకు భర్తీచేయనున్న ఖాళీలు ఇంకా అలాగే అర్హతల విషయానికి వస్తే..విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను ఈ పోస్టులకు భర్తీ చేయనున్నారు.ఇక వీటిలో ఇంజినీర్ (12 పోస్టులు), సూపర్‌వైజర్ (20 పోస్టులు ) ఖాళీలు ఉన్నాయి.పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతల విషయానికి వస్తే వారు ఖచ్చితంగా డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా అలాగే దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా వారికి తప్పనిసరిగా ఉండాలి.


ఇంకా అలాగే అభ్యర్థుల వయసు విషయానికి వస్తే వారికి 31-10-2022 నాటికి 45 ఏళ్లు అనేవి మించకూడదు.మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే..ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా కూడా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులను డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కులు ఇంకా అలాగే ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇక ఇందులో ఎంపికైన ఇంజనీర్‌ పోస్టులకు నెలకు రూ. 78,000 ఇంకా అలాగే సూపర్‌ వైజర్‌ పోస్టులకు రూ. 43,550 వరకు కూడా చెల్లిస్తారు.అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇతరులు మాత్రం రూ. 200 దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు విషయానికి వస్తే అది 21-11-2022తో ముగియనుంది.కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: