మన జీవితంలో ప్రతి పనీ కూడా డబ్బుల మీదనే ఆధారపడి జరుగుతుంది. ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఇప్పుడు డబ్బులు తప్పనిసరి. ముఖ్యంగా విద్య ఇంకా వైద్యం విషయంలో డబ్బులు లేకపోతే ఇక పరిస్థితి ఖచ్చితంగా కూడా చేజారినట్లే.అవసరమైన సమయంలో చేతిలో డబ్బులు లేక చదువుకోలేని చిన్నారులు ఇంకా అలాగే వైద్యం దొరకకపోవడంతో చనిపోయినవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. చదువులో ముందున్నప్పటికీ డబ్బు లేని కారణంగా చదువుకోలేరు కొంతమంది చిన్నారులు. ఈ పరిస్థితి దివువ ఇంకా అలాగే మధ్య తరగతి కుటుంబాలలో ఉండే సర్వసాధారనమైన సమస్యలలో   ఒకటి. అందుకే చాలా మంది కూడా కొడుకును చదివించి ఇంకా కూతురుని చదివించడానికి బాగా వెనకాడతారు. అందుకోసమే కేంద్రప్రభుత్వం అలాంటి చిన్నారుల కోసం ఓ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో డబ్బులు కట్టకుండానే బాలికలను కూడా ఉచితంగా చదువుకోవచ్చు.


వారి విద్యకు అయ్యే ఖర్చును అంతా కూడా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.ఇక బాలికల భవిష్యత్తు కోసం బాలికా సమృద్ధి యోజన పథకాన్ని 1997 అక్టోబర్ 2న, అప్పటి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని బాలికలకు ఉచితంగా విద్యను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని అనేక బాలికలలో కూడా అక్షరాస్యతను పెంచేందుకు ఇంకా అలాగే వారి భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రవేశపెట్టింది.అయితే 15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే బాలికా సమృద్ధి యోజన పథకానికి అర్హులు. ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న బాలికలందరూ కూడా ఈ పథకం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వారిద్దరూ కూడా ఈ పథకానికి అర్హులే.ప్రతి ఏటా వారి చదువు కోసం స్కాలర్ఫిప్ ను కూడా అందిస్తారు. అయితే ఈ పథకంలోని బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేస్తే వారు ఇలాంటి ప్రయోజనాలు పొందడానికి అనర్హులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: