మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి కేంద్రంగా ఢిల్లీలో తెలుగు రాజకీయాల్లో ఏదో జరగుతోంది. మంగళవారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవబోతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటున్న జగన్ రాత్రి 9 గంటలకు అమిత్ షా తో సమావేశం అవ్వటం ఆసక్తిగా మారింది. జగన్ ఢిల్లీ పర్యటన, అమిత్ షా తో భేటి హఠాత్తుగా డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. ఇంత హఠాత్తుగా జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకు పెట్టుకున్నారో కూడా అర్ధం కావటంలేదు. ఈ మధ్యనే ఢిల్లీ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే క్యాంపేసి ప్రధానమంత్రితోను అమిత్ షా తో భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇపుడు అమిత్ తో భేటీ అవ్వబోతున్నారంటే ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటుందనే అనుకుంటున్నారు.
ఇక తెలంగాణా సీఎం కేసీయార్ కూడా మూడు రోజుల ఢిల్లీ టూర్ సోమవారంతో ముగిసిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని దెబ్బపడిన వెంటనే ఢిల్లీకి వెళ్ళారు కేసీయార్. అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయిన కేసీయార్ చివరకు ప్రధానమంత్రితో 40 నిముషాలు భేటీ అయ్యారు. వీళ్ళమధ్య భేటి విషయం స్పష్టంగా బయటకు తెలియనప్పటికీ బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చల్లాంటివేదో జరిగాయనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ చర్చలకు హేతువు ఏమిటంటే ఒకవైపు మోడిపై ఉత్తరాధిలో వ్యతిరేకత పెరిగిపోతోంది. అందుకనే దక్షిణాదిలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కుంటోంది. కొత్తమిత్రులను వెత్తుకోవటంలో భాగమే కేసీయార్ తో భేటి అనేది ప్రచారం సారంశం.
ఇపుడు జగన్ ఢిల్లీ పర్యటన విషయం బయటపడగానే మళ్ళీ బీజేపీ-టీఆర్ఎస్ పొత్తు చర్చలకోసమే అనే ప్రచారం మొదలైంది. మూడుపార్టీలు కలిస్తే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. అదే టీఆర్ఎస్, వైసీపీతో బీజేపీ దూరంగా ఉంటే నష్టపోయేది బీజేపీనే అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎన్డీయేలో ఈ రెండు పార్టీలు చేరాలంటే ముందుగా రాష్ట్రప్రయోజనాలు నెరవేరాల్సుంటుంది. అదిలేకుండా కేవలం మోడి అడిగారనో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమనో బీజేపీతో చేతులు కలిపితే మాత్రం రెండుపార్టీలు నష్టపోవటం ఖాయం. ఇదే సమయంలో బీజేపీకి కూడా నష్టం జరుగుతుంది. అయితే బీజేపీకి మోడికి జరిగే నష్టంతో పోల్చితే తెలుగురాష్ట్రాలకు జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయం ముఖ్యమంత్రులకు తెలీకుండా ఉండదు. మరి ఇద్దరు వెంట వెంటనే ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారంటే తెరవెనుక ఏదో పెద్ద వ్యవహారమే జరుగుతోంది. అదేమిటన్నదే సస్పెన్సు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి