నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే.. సీనియ‌ర్‌నాయ‌కులు.. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? ఆయ‌న విష‌యంలో సీఎం జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నారా? అంటే.. నెల్లూరు కుచెందిన ఆనం వ‌ర్గీయులు.. ఔన‌నే అంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఇదే అంశంపై, వెంక‌ట‌గిరిలో పెద్ద ఎత్తున పోస్ట‌ర్లు కూడా వెలిశాయ‌ట‌. ఆనం కాబోయే మంత్రి అంటూ..ఆయ‌న అనుచ‌రులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆర్తిక మంత్రి ప‌దవి ఇచ్చేందుకు సీఎం జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని కూడా వీరు ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేయ‌డం ఖ‌చ్చిత‌మేన‌ని తెలుస్తోంది. అంటే.. నిజానికి ఒక‌రిద్ద‌రు మంత్రుల‌ను ఆయ‌న కొన‌సాగిస్తార‌ని.. అంటున్నా.. అది కూడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. పూర్తిగా మంత్రి వ‌ర్గాన్ని మారుస్తార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గాన్ని కూర్పు.. చేర్పుల బాధ్య‌త‌ల‌ను కీల‌క నేత‌లు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సాయిరెడ్డిల‌కు జ‌గ‌న్ అప్ప‌గించారు. దీంతో మంత్రుల‌పై వీరు భారీగానే క‌స‌ర‌త్తు చేస్తున్నారు.. ఈ క్ర‌మంలో ఆర్థిక శాఖ‌ను సాయిరెడ్డికి ఇస్తార‌నే ప్ర‌చారం కొన్నాళ్లుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

అయితే.. సాయిరెడ్డికి కాకుండా.. సీనియ‌ర్ నాయ‌కుడు, గ‌తంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేసి మంచి పేరు కూడా తెచ్చుకున్న ఆనంకు ఇస్తే.. బాగుంటుంద‌ని..  కొంద‌రు సూచించార‌ట‌. పైగా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు. ఆనంకు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టుకునేందుకు కూడా భారీ ఎత్తున అవ‌కాశం ఉంటుంద‌ని కొంద‌రు సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆనంకు ఆర్థిక శాఖ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఆయ‌న అనుచ‌రరులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇదే విష‌యం.. ఆనం సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూచ‌ర్చ‌గా మారింది.

అయితే వాస్త‌వంగా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పార్టీలో గ‌త రెండేళ్లుగా పెద్ద అస‌మ్మ‌తి నేత‌గా మారారు. ఆయ‌న సొంత పార్టీ అధిష్టానంను ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు జ‌గ‌న్ ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. చివ‌ర‌కు పార్టీ ఆయ‌న్ను స‌స్పెండ్ చేస్తుంద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. మ‌రి అలాంటి నేత‌కు ఆర్థిక మంత్రా అంటే చూడాలి... ఏం జ‌రుగుతుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: