జగన్ పాలనలో అంతా అరాచకాలే జరుగుతున్నాయని.. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని తరచూ టీడీపీ ఆరోపణలు గుప్పిస్తుంటోంది. జగన్ పరిశ్రమలను ఆకట్టుకోవం లేదని.. అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని టీడీపీ అనుకూల మీడియా కూడా వరుసగా కథనాలతో కుమ్మేస్తుంటాయి. కానీ.. ఇప్పుడు కేంద్రం తాజాగా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాంకులు చూస్తే దిమ్మతిరిగిపోయేలా ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలించింది. అయితే.. గతంలో ఇచ్చినట్టు ర్యాంకులు ఇవ్వకుండా టాప్ 7 రాష్ట్రాల లిస్టు ఇచ్చింది కేంద్రం.


అందులో ఏపీ కూడా ఉండటం జగన్ సర్కారుకు ఆనందం కలిగించింది. ఏపీ ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌లో  మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్  హర్షం వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద 10, 200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు ఇచ్చారని అమర్నాథ్ అంటున్నారు.


టాప్ అఛీవర్స్ జాబితాలో ఏడు రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలవడం గర్వ కారణంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. ఏపీ 97.89 శాతంతో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, 97.77 శాతం సాధించి గుజరాత్ రెండో స్థానంలోను, 96.97 శాతంలో తమిళనాడు మూడో స్థానంలో నిలిచిందని మంత్రి అమరనాథ్  పేర్కొన్నారు. ఈ నెంబర్ వన్ ర్యాoకు రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పారిశ్రామిక రంగంలో తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలే కారణమంటున్నారు.


టాప్ అఛీవర్ ర్యాంకులలో మొదటిస్థానంలో నిలిచిన ఏ పీ కి పెద్దయెత్తున పెట్టుబడులు రావడానికి  అవకాశాలు మెరుగయ్యాయని.. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలి రావడానికి అవకాశాలు పెరిగాయని మంత్రి అమరనాథ్ అంటున్నారు. ఈ ర్యాంకింగ్ వలన రాష్ట్రలో పారిశ్రామిక ప్రగతికి నూతనోత్తేజాన్ని నింపుకొంటుoదని మంత్రి అమరనాథ్ అభిప్రాయ పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: