బ్రిటన్‌ అంటే తెల్లదొరల దేశం.. ప్రపంచంలో ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ.. ఓ నానుడి ఉండేది.. అంతే అంత విశాలమైందన్నమాట.. ప్రపంచంలో దాదాపు సగభాగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న చిన్న దేశం బ్రిటన్.. 1500 సంవత్సం ప్రాంతంలో బలమైన నౌకాబలంతో ప్రపంచంపై దండెత్తిన దేశం.. క్రమంగా అనేక దేశాల్లో వలస పాలన సాగించింది. ఇండియా వంటి సువిశాల దేశాన్ని కూడా ఎక్కడో బ్రిటన్‌లో ఉండి తెల్లదొరలు పాలించారు. దాదాపు 300 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం ఇండియాను బ్రిటిష్ దొరలు పాలించారు.


ఆ 300 ఏళ్లలో బ్రిటిష్ వారు సాగించిన దురాగతాలెన్నో. అలాంటి బ్రిటన్‌లో ఇప్పుడు ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రధాని అవుతాడనే ప్రచారం జరుగుతోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ రాజీనామా చేశారు. ఆయన పాలనపై కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగానూ ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయన వద్ద మంత్రులుగా పని చేయలేం అని స్వయంగా 54 మంది వరకూ మంత్రులు రాజీనామాలు కూడా చేశారు. అలాంటి సమయంలో తదుపరి బ్రిటన్ ప్రధాని ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.


అలాంటి సమయంలో కాబోయే బ్రిటన్ ప్రధాని రేసులో ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే.. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ పేరు. అదే నిజమైతే..  బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధిస్తారు. మరి అసలు ఈ రిషి సునాక్‌ ఎవరు.. ఆయనకూ ఇండియాకు ఉన్న సంబంధం ఏంటంటే.. రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో పుట్టారు. రిషి సునాక్‌పూర్వీకులు ఇండియాలోని పంజాబ్‌కు చెందినవారు.


రిషి సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లలతో సహా బ్రిటన్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. రిషి సునాక్‌ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాకు చెందినవారు.. రిషి సునాక్‌ తల్లి ఉష టాంజానియాలో పుట్టారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలస వెళ్లన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నారు. రిషి సునాక్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చదివారు. కాలిఫోర్నియాలో చదువుతున్నప్పుడు.. రిషి సునాక్‌.. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాను ప్రేమించారు. వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: