
నా స్నేహితుల సూచన మేరకు ఎర్తిన్ కన్సార్షియంలో డైరెక్టర్ గా చేరానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ కంపెనీ అత్యధిక బిడ్ వేసి 500 కోట్ల రూపాయలకు భూములు దక్కించుకుంటే తప్పేముందని నరేన్ రామాంజులరెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని నరేన్ రామాంజులరెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎం బంధువనే కారణంతోనే మీడియాలో అసత్యపు కథనాలు ప్రసారం చేస్తున్నారని నరేన్ రామాంజులరెడ్డి ఆక్షేపించారు.
ఎర్తిన్ కన్సార్షియంలో డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఎలాంటి తప్పులు చేయలేదని నరేన్ రామాంజులరెడ్డి అంటున్నారు. ఇందులో ఏదైనా అవకతవకలు ఉంటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే చర్యలకు తాము బాధ్యత వహిస్తామని నరేన్ రామాంజులరెడ్డి అంటున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానేమనని నరేన్ రామాంజులరెడ్డి చెబుతున్తనారు. సీఎం బంధువు అయినంత మాత్రాన తప్పులు చేయాలని లేదని నరేన్ రామాంజులరెడ్డి చెప్పుకొస్తున్నారు.
అంతే కాదు.. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు సీఎం సమీప బంధువులు వై.ఎస్.కొండారెడ్డి, వై.ఎస్.ప్రతాప్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన విషయాన్ని నరేన్ రామాంజులరెడ్డి గుర్తు చేస్తున్నారు. ఇందూ దివాలా, లేపాక్షి భూముల విషయంలో ప్రతిపక్షాలు, మీడియా అనవరసంగా రాద్ధాంతం చేయడం తగదని నరేన్ రామాంజులరెడ్డి.. కడప పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు.