తెహ్రీక్ -ఇ- తాలిబాన్ల ఎటాక్, బెలూచి రెబల్స్ ఎటాక్, సింధు రెబల్స్ ఎటాక్ తో పాకిస్థాన్ సైనికులు దాదాపుగా 220 మంది చనిపోయారు. బాంబు దాడులు, సడన్ ఎటాక్ లు, పాక్, ఆప్ఘన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఒక రకమైన యుద్ధ వాతావరణమనే చెప్పాలి. దీంతో ఆ మధ్య రెచ్చిపోయి మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి తాలిబాన్ల స్థావరాలు అన్ని మాకు తెలుసు వాటిని పూర్తిగా నామరూపాల్లేకుండా చేసేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన తాలిబాన్లు రండి చూసుకుందాం అన్నారు. దీంతో కంగుతిన్న పాకిస్థాన్ వెనక్కి తగ్గింది.


సీన్ కట్ చేస్తే పాకిస్థాన్ ప్రధానమంత్రి తాలిబాన్లతో షబాద్ షరీఫ్ ప్రభుత్వం తెహ్రీక్ -ఇ- తాలిబాన్లను కంట్రోల్ చేయాలని తాలిబాన్ల ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయమని కోరింది. ఇది రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది.  దోహలో గతంలో కుదిరిన ఓప్పందం ప్రకారం పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు దాడులు చేసుకోకూడదని ఉంది. దానికి విరుద్ధంగా చేస్తే ఎలా అని పాక్ కు చెందిన రక్షణ అధికారి ఒకరు తాలిబాన్ల నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా తాలిబాన్లకు మద్దతు నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పాక్.


దీంతో పాకిస్థాన్ సైనికులపై దాడులు చేయకుండా సద్దుమణగాలని, అలాగే పాక్ సైనికాధికారులు కానీ, సైనికులు కానీ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని రహస్యంగా పరస్పరం ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.  ఏదేమైనా పాక్, తాలిబాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమణే పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇంకెంత కాలం ఈ గొడవల్ని అణిచిపెడతారో చూడాలి. యుద్ధమే జరుగుతుందా ఒకవేళ యుద్ధం జరిగితే పాక్ కి నష్టం కలుగుతుందా. తాలిబాన్లు పాక్ ను ఎదుర్కొనగలరా.. ఇప్పటికే పాక్ లో ఆర్థిక సంక్షోభం ముదిరిపోయింది. గోధుమ పిండి, పెట్రోల్ ధరలు భగ్గు మంటున్నాయి. దీనికి తోడు ఈ వివాదం పాక్ ను హడలెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: