సాధారణంగా న్యాయవాదులు తమ దగ్గరకు వచ్చే  క్లైంట్ కు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ తీర్పు క్లైంటుకు అనుకూలంగా వచ్చినా దానిని అమలు చేయని అధికారులు ఉన్నప్పుడు  వారు భయపడాలని కోరుకుంటారు. జస్టిస్‌ భట్టు దేవానంద్ పవర్ ఏంటో ఇప్పుడు అధికారులకు తెలుస్తుంది. ఆయన అంటే అధికారులకు ఇప్పుడు అదే భయం కలుగుతుంది. ఆయనిచ్చే తీర్పులు అలా ఉంటున్నాయి. దానికి తాజా ఉదాహరణగా ఆయన ఒక్క పిలుపుకే అధికారులు పరిగెత్తుకుంటూ బెంచ్ కి బయలుదేరారు.


జగన్ ని  నమ్ముకుంటే అధికారులకు జైలు శిక్షే అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఏ ధర్మాసనంలోనైనా  న్యాయమూర్తులు తప్పు చేసిన అధికారులను విమర్శించడం, లేదంటే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పటి వరకు జరిగింది. కానీ జస్టిస్ భట్టు దేవానంద్  విషయం దగ్గరికి వచ్చేసరికి అధికారులను పిలిపించి మరీ శిక్షలు వేయడం  చేస్తున్నారు.


ఈ మద్య ఇద్దరు న్యాయమూర్తుల బదిలీలను ఆపివేయాలని న్యాయమూర్తులు  ఆందోళన చేశారు. ప్రత్యేకించి జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీని నిలిపివేయాలని  ఉద్యమం చేశారు న్యాయవాదులు. ఎందుకంటే ఆయన బెంచ్ లో మాత్రమే అధికారులకు సరైన శాస్తి జరుగుతుంది. అయితే అధికారుల వాదనను బట్టి, సాధారణంగా మమ్మల్ని పెనాల్టీ కట్టమని చెప్తుంటారు, అంతేగాని మమ్మల్ని ఇలా పిలిపించడం,  ఇలా కోర్టులో గంటల తరబడి నిల్చోబెట్టడం ఏంటని వారు  వాపోతున్నారు. వారికి అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు.


తాజాగా ఇద్దరు అధికారులను వాళ్ల శాఖలో చేసిన తప్పిదాల దృష్ట్యా  అరెస్టు చేసి అదుపులోకి తీసుకోమని తీర్పునిచ్చింది. అయితే వారికి అప్పీలు చేసుకోవడానికి అవకాశం రావడంతో వారి వయసును పరిగణనలోకి తీసుకుని వారిని పెనాల్టీ కట్టమని, కోర్టులో సాయంత్రం వరకు  నిలుచోమని జస్టిస్ భట్టు దేవానంద్ తీర్పును ఇచ్చారు. దానితో అవమాన పడిన అధికారులు సుప్రీంకోర్టు, అధికారులను కోర్టుకు పిలిపించవద్దని చెప్పింది కదా, అయినా హైకోర్టు ఇలా చేయడం ఏంటని,  దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయమని  ప్రభుత్వంపై అధికారులు  తిరగబడుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: