
ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష కూడా మాండరిన్, చైనాలో ఎక్కువ జనాభా ఉంటుంది. అందులో చాలా మంది మాండరిన్ భాషను మాట్లాడతారు. అరబిక్ భాష కూడా చాలా గల్ప్ దేశాల్లో అధికార భాషగా కొనసాగుతోంది. వీటిని మాట్లాడాలంటే చాలా కష్టమట. ఆ తర్వాతి స్థానం తెలుగుదే. అంటే తెలుగు వారికి ఈజీగా వచ్చి ఉండొచ్చు. కానీ ఇతర భాషల వారికి తెలుగు నేర్చుకోవాలన్నా, దాన్ని అనర్గళంగా మాట్లాడాలన్న అంత తేలికేం కాదు. ఎందుకంటే తెలుగు భాషలో వినూత్నమైన పదాలు, పద్యాలు, పదబంధాలు, సరళాలు, పరుషాలు, అంత్యాలు, త్యజాలు ఇలా చెప్పుకుంటే పోతే తెలుగు గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
అమ్మా నాన్న అనే పిలుపులో ఉండే మాధుర్యం కూడా మరే ఇతర భాషల్లో ఉండదనిస్తుంది. మనిషి ఒక భావాన్ని వ్యక్తీకరించడంలో విషయాన్ని అర్థవంతంగా చెప్పడంలో ఎవరికీ అందనంత ఎత్తులో తెలుగు భాష అగ్రస్థానాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాటల మాధర్యం, పాటల సింగారం, అక్షరాల పొందిక, ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ప్రపంచంలోనే కఠిన భాషల్లో మూడో స్థానం అంటేనే కాస్త బాధ కలుగుతుంది. ఇంతటి మధురమైన భాష మరెక్కడా ఉండదు.