
కూటమి పార్టీలైన బీజేపీ, జనసేనలకు గత ఎన్నికల్లో టీడీపీ తక్కువ స్థానాలనే కేటాయించిందన్న చర్చ ఉంది. అయితే.. వాస్తవానికి.. ఆయా పార్టీల స్థాయి.. వాటికి ఉన్న నాయకగణం అన్నింటినీ భేరీజు వేసు కుంటే.. మరింత మందికి అవకాశం ఇచ్చి ఉండాలన్న చర్చ ఉంది. కానీ.. అది సాధ్యం కాలేదు. టీడీపీలో నే ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. దీంతో కూటమి పార్టీలకు పూర్తిగా న్యాయం చేసేందుకు అవకాశం చిక్కలేదు.
మరీ ముఖ్యంగా టీడీపీలో సీనియర్లు చాలా మంది తప్పుకొని తమ తమ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చా యి. దీనికితోడు కొత్తగా వచ్చిన వారు.. పొరుగు పార్టీలకు చెందినవారు.. కూడా సీట్లను సంపాయించుకు న్నారు. దీంతో ఇప్పుడున్న నాయకులకే.. 175 స్థానాల్లో సంపూర్ణంగా న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. కనీసం రాష్ట్ర విభజన చట్టం లెక్క ప్రకారం మరో 50 సీట్లు పెరిగినా.. సరిపోవన్న చర్చ ఉంది.
అయితే.. అంతకు మించి సంఖ్య పెరుగుతుందా? అంటే.. డౌటే. ఇక, వచ్చే నెల లేదా.. మరికొద్ది వారాల్లో నే.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం కసరత్తు ప్రారంభించనుంది. ముఖ్యంగా విభజిత ఏపీ విషయంలో ఇప్పటికి రెండు సార్లు.. ఈ విషయంపై.. కూటమి సర్కారు కూడా కేంద్రానికి విన్నపాలు పంపించింది. ఈ నేపథ్యంలో కనీసం 250 స్థానాలకు పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కానీ.. లెక్క ప్రకారం 225 వరకు స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ క్రతువు పూర్తయ్యే అవకాశం ఉందని.. నాయకులు చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు