- ( అమ‌రావతి - ఇండియా హెరాల్డ్ )

వరుస పరాజ‌యాలు ఎదురవుతున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం తన మౌనాన్ని వీడ‌టం లేదు. ఎక్కడ పార్టీపై ఓ సమీక్ష కాని ... ఒక దూకుడు చర్చ గాని జగన్ నిర్వహించడం లేదు. తాజాగా మడకశిర నగర పంచాయతీలో వైసిపికి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ నరసింహారాజుకు మద్దతుగా నిలిచారు. ఆర్టీవో ఆనంద్ కుమార్ ప్రెసిడెంట్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి పూర్తిగా గైర్హాజరయ్యారు. తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు నరసింహారాజుకు స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే , టిటిడి పాలకమండలి సభ్యులు ఎమ్మెస్ రాజు మద్దతు తెలిపారు. మొత్తం 15 మంది మద్దతుతో మడకశిర నగర పంచాయతీపై పశువు జెండా రెపరెపలాడింది.


అలా మడకశిర నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది. ఇక చీరాల కడపలో కూడా ఇప్పటికే టిడిపి కూటమి విజయం సాధించింది. మరోవైపు మైదుకూరులోనూ మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజరామ చేశారు. కీలకమైన స్థానాలన్నీ ఇలా చేజారిపోవడం ఒక ఎత్తు అయితే పిన్మెల్లి రామకృష్ణారెడ్డి లాంటి బలమైన నేత ఇన్చార్జిగా ఉన్న మాచర్లలో మునిసిపల్ చైర్మన్ తురకా కిషోర్ కుమార్ చైర్మన్ పదవి పోయింది. ఇలా వరుసగా రెండు రోజుల నుంచి ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న జగన్ మాత్రం పెదవి విపటం లేదు. బయటికి రావటం లేదు. ప్రస్తుత ఆయన బెంగుళూరులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ టైంలో ఆయన నోరు మెదిపి పార్టీ కేడర్ కు అండగా ఉంటానన్న నాలుగు మాటలు మాట్లాడటం చేయకపోతే.. కేడర్లు ఆత్మస్థైర్యం మరింత సన్నగలుగుతుంది అన్న చర్చలు వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: