
సీఎం రేవంత్ రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ లభ్యమైతే యాజమాన్యాలే బాధ్యత వహించాలని, విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు బిహేవియర్ అబ్జర్వర్స్‌ను నియమించాలని సూచించారు. పాఠశాలల సమీపంలో చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లలో గంజాయి కలిపి విక్రయిస్తున్నారని, ఇలాంటి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్’ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు, ఇది గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై నిశితంగా నిఘా పెడుతుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరుగాంచిందని, దీన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చడం అవమానకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశ భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారి యువతను నాశనం చేసిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా యువతను సన్మార్గంలో నడిపించాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. సినీ హీరోలు రాంచరణ్, విజయ్ దేవరకొండలు డ్రగ్స్‌కు దూరంగా ఉండి విజయం సాధించారని, వారి నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర శ్రమ, కఠిన దీక్ష ద్వారానే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని, ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం సాధించిన గుర్తింపును కాపాడుకోవాలని ఆకాంక్షించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు