
సేర్ప్, చిన్న తరహా పరిశ్రమలు, ఏపీ ఎన్నార్టీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రచారాలకు దూరంగా ఉండే మంత్రి.. పని చేసే విషయంలో మాత్రం దూకుడుగా ఉంటారు అంటారు టీడీపీ కార్యకర్తలు. గత ఏడాది కాలంలో మంత్రి పని తీరుపై ప్రసంశలు దక్కాయి. ఇక గత నెల రోజుల నుంచి మంత్రి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఏపీలో పెన్షన్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో జ్వరంతో బాధ పడుతున్న మంత్రి.. విజయనగరంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో పాల్గొని, నేరుగా విజయవాడ వెళ్ళారు.
అక్కడి నుంచి పెన్షన్ లపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సిఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత జ్వరంతోనే కేబినేట్ సమావేశానికి హాజరు అయ్యారు. అక్కడి నుంచి జ్వరం తీవ్రం కావడంతో కొంత విశ్రాంతి తీసుకున్న ఆయన, ఆ తర్వాత కొన్ని రోజులకే దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఈ నెల 2 న దావోస్ వెళ్ళిన ఆయన, జర్మని పర్యటనకు కూడా వెళ్లి అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఇక ఆ తర్వాత నేపాల్ సమస్య ఉత్పన్నం కావడంతో.. అక్కడి నుంచే బాధితులతో, సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. వెంటనే గురువారం ఉదయం విజయవాడ చేరుకొని, ఈ అంశంపై రెండు రోజుల నుంచి నిర్విరామంగా సమీక్షా సమావేశాలు జరిపి అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఏపీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న మంత్రి నారా లోకేష్ ను కలిసారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ ఆఫీస్ లో లోకేష్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొనడం, అక్కడి అధికారులతో మాట్లాడటం, తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయడంలో తన వంతు పాత్ర పోషించారు కొండపల్లి శ్రీనివాస్.