కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అనేక విభాగాలలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ పోస్టులు... ఎక్కడ ఎన్ని  ఖాళీగా ఉన్నాయో చూసి అందులో మీరు కానీ ఈ పోస్ట్ లకు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని సంపాదించండి. ఇక ఆ ఉద్యోగాల పూర్తి వివరాలు మీకోసం...

 

 

AIMS (న్యూఢిల్లీ) ఖాళీల వివరాలు ఇలా... న్యూఢిల్లీ ఉన్న ఆల్ ఇండియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIMS) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక ఆ పోస్టుల వివలా విషయానికి వస్తే సీనియర్ మెడికల్ ఆఫీసర్‌‌–01, నర్సింగ్ ఆఫీసర్‌‌–02,  డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌–01. ఇక వీటికి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌ లో పదో తరగతి, GNM, డీఎన్‌ సీ, ఇంటర్ మీడియట్‌‌, బీఎస్సీ(నర్సింగ్‌), ఎండీ ఉత్తీర్ణత, వాటికీ అవసరమైన అనుభవం. ఇక ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగును. వీటి కోసం ఆఫ్ ‌‌లైన్‌ లేదా ఈ – మెయిల్‌‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - రూం నెం. 9, న్యూ ప్రైవేట్‌‌, 3వ అంతస్తు, డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ పల్మనరీ క్రిటికల్‌‌ కేర్ అండ్ స్లీప్‌ మెడిసిన్‌, AIMS, న్యూఢిల్లీ. లేకపోతే ఈ – మెయిల్ kandpalkirti94@gmail.com  ద్వారా కూడా మీ పూర్తి వివరాలను పంపవచ్చు. వీటికి చివరి తేది జూన్‌13.

 


అలాగే నేషనల్ మ్యూజియంలో ఖాళీల వివరాలు ఇలా... న్యూఢిల్లీ ఉన్న భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మ్యూజియంలోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీలు 08. పోస్టుల వివరాలలోకి వెళితే కాపీరైటర్‌, గ్రాఫిక్ డిజైనర్‌‌, ప్రొడక్ట్ డిజైనర్‌‌, విజిటర్ ఎక్స్‌ పీరియన్స్ మేనేజర్‌‌, వెబ్ డెవలపర్ గా ఉన్నాయి‌‌. వీటికి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌ లో డిగ్రీ (జర్నలిజం, హిస్టరీ, మార్కెటింగ్‌, డిజైన్ ఆర్ట్ ‌‌/ ఫైన్ ఆర్ట్‌‌, కంప్యూటర్ సైన్స్‌), బీఏ / ఎంఏ ఉత్తీర్ణత, అలాగే పోస్ట్ కు సంబంధిచి అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ ప్రాసెస్‌ షార్ట్‌‌లిస్టింగ్ ఆధారంగా జరుగును. వీటి కోసం ఈ – మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ వివరాలును ఈ–మెయిల్ sunita.dhavale@nic.in ద్వారా పంపగలరు. వీటికి చివరి తేది జూన్‌ 19.

మరింత సమాచారం తెలుసుకోండి: