చిన్నప్పటి నుంచి విద్యార్థులకు పర్యావరణం పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతం లో ఎనిమిదో తరగతి నుంచి పర్యావరణానికి సంబందించిన సబ్జెక్టులను చేర్చారు. అలాగే వాటి గురించి విద్యార్థులకు అవగాహాన కల్పించేవారు. సైన్స్ వేర్ అనే కార్యక్రమాలను చేస్తుండేవారు. విద్యార్థులు కూడా వారి ప్రతిభను తెలుసుకొనేందుకు ప్రయోగాలను కూడా చేసేవారు. అయితే, ఇప్పుడు విద్యార్థులకు పర్యావరణం పై పూర్తి అవగాహన కల్పించేందుకు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.


ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో జరపాలని గతం లో ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. కాగా కరోనా తీవ్రత దృష్ట్యా అసైన్ ‌మెంట్‌ రూపం లో ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. విద్యార్థులు ఇంట్లోనే అసైన్‌ మెంట్‌ రాసి సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. మ రోవైపు ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కూడా వాయిదా పడే అవకాశం ఉందంది. ప్రాక్టికల్స్‌ పై ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు.


కాగా ఈసారి వార్షిక పరీక్షలు లేకుండా పాస్‌ చేసే ఆలోచన లేదన్నారు. పోయిన సంవత్సరం తో పోలిస్తే విద్యార్థుల మధ్య నైతిక దూరం  పాటించి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు.. మే 1 నుంచి వార్షిక పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ అతి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పరీక్షలను నిర్వహించాలా లేదా అనే అంశం పై చర్యలను చేపట్టారు. గత ఏడాది విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు జరగలేదు.. ముఖ్యంగా ఏడాది వరకు తరగతులను మొదలు పెట్టలేదు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందనే దైర్యం తో ప్రారంభించిన కూడా విద్యార్థుల తల్లి దండ్రులు భయపడుతున్నారు. ఇక సర్కార్ తుది నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: