మనలో సాధారణంగా చాలామంది ఎక్కువగా అరటి పండ్లు అంటే గ్రీన్ లేదా ఎల్లో అరటి పండ్ల ను మాత్రమే చూసి ఉంటారు.. అయితే ఎర్రటి అరటి పండ్లు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. సాధారణ అరటి పండ్లలో కంటే ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.. మన దగ్గర ఎప్పుడు దొరికేటువంటి పండ్లతో పోలిస్తే ఇందులో విటమిన్స్ పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అరటి పండ్లు ఆరోగ్యానికి ఆరోగ్యం జీర్ణక్రియకు కూడా దివ్య ఔషధంగా పనిచేస్తాయని తెలుపుతున్నారు..


ఎర్రటి అరటి పండ్లు అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఒకటి తిన్న కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది దీంతో సులువుగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.


ఎర్రటి అరటి పండ్లు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును సైతం తగ్గించేస్తుంది.. అలాగే ఇందులో ఉండేటువంటి ఫైబర్ వల్ల ప్రేగు కదలికలు కూడా చాలా మెరుగుపడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.


ఎర్రటి అరటి పండ్లలలో కెరోటినాయిడ్స్ , డోపమైన్, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉండడం వల్ల ఇది క్యాన్సర్ గుండె జబ్బుల భారీ నుంచి చాలామందిని విముక్తి చేస్తుందట. వీటితోపాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తుందట.


ఎర్ర అరటిపండ్లలో బీటా కెరటిన్ చాలా సమృద్ధిగా ఉంటుంది.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.. అలాగే బ్యాక్టీరియా వైరస్ ఇతరత్రా హానికరమైన సూక్ష్మజీవులను కూడా మన శరీరంలో లేకుండా చేస్తుందట.


సాధారణ అరటిపండ్లలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు ఎర్రటి అరటి పండ్లలో చాలా తక్కువగా లభిస్తాయి. అందుకే షుగర్ పేషెంట్లు కూడా వీటిని తినవచ్చు.


అలాగే ఎర్ర అరటి పండులో ఉండేటువంటి విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఇందులో కెరోటి నాయిడ్స్  ఉండడంవల్ల.. చర్మం మీద ఏవైనా మచ్చలు వంటివి తొలగిపోతాయి. అందుకే చాలామంది ఈ ఎర్రటి అరటి పనులు కాస్త ధర ఎక్కువైన కొని తింటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: