సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎలాగో అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే పర్సనల్ విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడు సినీ సెలబ్రిటీలు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ల ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఎప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఎంత వద్దనుకున్న ఎంత రహస్యంగా ఉంచాలి అనుకున్న కొన్ని కొన్ని సార్లు సెలబ్రెటీల ప్రేమయనాలు మీడియా కంటకు చిక్కుతూ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలా గత కొంతకాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలో తమ ప్రేమాయణంతో హాట్ టాపిక్ గా మారిపోయిన సెలబ్రిటీ జంటలలో అదితి రావు హైదరి, హీరో సిద్ధార్త్ కూడా ఒకరు. వీరిద్దరూ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం అనే మూవీలో కలిసి నటించారు. అయితే ఈ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ఏకంగా చట్టపట్టలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. అయితే తమ మధ్య ప్రేమ ఉంది అనే విషయాన్ని మాత్రం ఎక్కడా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ వీరి వ్యవహార శైలి చూసి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు.


 అయితే సినీ నటులు సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఎవరికీ తెలియకుండా ఓ గుడిలో ఇలా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇక నిశ్చితార్థం తర్వాత అఫీషియల్ ప్రకటన చేసి తమ బంధం గురించి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అదితి రావు హైదరి సిద్ధార్థ తో బంధం గురించి చెప్పుకొచ్చింది. సిద్ధార్త్ నన్ను చాలా మార్చాడు. అతని పరిచయం తర్వాతే ప్రేమపై నమ్మకం కలిగింది. మా ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉంటుంది. పుకార్లకు చెక్ పెట్టేందుకు నిశ్చితార్థం చేసుకున్నాం. ఏదైనా చెప్పే విషయం అయితే మేమే చెప్తాం. మా వ్యక్తిగత జీవితాన్ని ప్రజలు గౌరవించాలి అంటూ అదితి రావు హైదరి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: