విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని క‌దిలించినా.. గ‌ద్దె మాటే వినిపిస్తోంది. ఆయ‌న‌ను సీనియ ర్‌గా.. వివాద ర‌హితుడిగానే చూస్తున్నారు. దూకుడు స్వ‌భావం లేకుండా.. అభివృద్ధి మంత్రం పఠిస్తున్నా ర‌ని ప‌లువురు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. వాస్త‌వానికి వైసీపీ ఈ సీటుపై చాలానే ఆశ‌లు పెట్టుకుంది. కానీ, అంత‌ర్గ‌తంగా వైసీపీకి బ‌లంగా ఉన్న బొప్ప‌న భ‌వ‌కుమార్‌, య‌ల‌మంచిలి ర‌వి వంటి వారు పార్టీకి దూర‌మ‌య్యారు.


కొద్ది రోజుల కిందట టీడీపీలో చేరిన‌ బొప్ప‌న భ‌వ‌కుమార్‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌శాంతత‌పై చ‌ర్చించారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఐదేళ్లుగా అంద‌రూ ప్ర‌శాంతంగా ఉన్నార‌ని.. ఇదే కొన‌సాగాలంటే.. గ‌ద్దె రామ్మోహ‌న్‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద ని తేల్చి చెప్పారు. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మెగా ఫ్యాన్సు అసోసియేష‌న్ కూడా ఎక్కువ‌గా ఉంది. ఈ సంఘం నాయ‌కుల‌తోనూ.. గ‌ద్దె రామ్మోహ‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వీరిని కూడా స‌మ‌న్వ‌యం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు.


బెజ‌వాడ తూర్పులో క‌మ్మ ఓట‌ర్లు 55 వేలు ఉంటే.. కాపులు కూడా 40 వేల పైనే ఉన్నారు. వీరు కూట‌మి నేప‌థ్యంతో పాటు జ‌న‌సేన‌తో పొత్తు.. ఇటు ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌తో పాటు వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తుండ‌డం అస్సలు కాపుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పైగా వీళ్లు అర్బ‌న్ కాపు ఓట‌ర్లు. దీంతో వీళ్లు పై కార‌ణాల‌తో పాటు స్థానికంగా గ‌ద్దె కాపుల‌తో స‌ఖ్య‌త‌తో ఉండే నేప‌థ్యంలో ఆయ‌న‌కే త‌మ ఓటు అని తేల్చి చెప్పేస్తున్నారు.


ఇదిలా ఉంటే త‌న‌కు ఇబ్బందిగా ఉంటార‌ని భావిస్తున్న కీల‌క నేత‌ల‌తోనూ.. గ‌ద్దె మాట్లాడుతున్నారు. వారిని సంతృప్తిప‌రుస్తున్నారు. ముస్లిం మైనారిటీ నేత‌ల‌తోనూ గ‌ద్దె భేటీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్దిని వివ‌రించారు. గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ ప్ర‌భుత్వం లేక‌పోయినా.. సాధ్య‌మైనంత వ‌ర‌కు తాను కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఐదేళ్ల‌లో చేసిన అభివృద్ధిని ఆయ‌న వివ‌రించారు. వ‌చ్చే ఐదేళ్ల‌కు సంబంధించి ఉన్న ప్లాన్‌ను  కూడా గ‌ద్దె వారి ముందు పెట్టారు. ఆటోన‌గ‌ర్ పారిశ్రామిక వేత్త‌ల‌తోనూ గ‌ద్దె చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.


గ‌ద్దె ప్ర‌చారం అంతా అంత‌ర్గ‌తంగా, చాప‌కింద నీరులా కొన‌సాగింది. ఉద‌యం 6 గంట‌ల నుంచి పార్టీ కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కార్మికుల‌ను క‌లుస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి, ప్ర‌శాంతత వంటి అంశాల‌పై చ‌ర్చ జ‌రిగేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ద్దె వైపే ప్ర‌జ‌ల మొగ్గు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: