ఇక డిజిటలైజేషన్ అనేది చాలా వేగంగా జరుగుతున్నందున కొన్నిటెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతోంది. అందులో క్లౌడ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ముందు వరుసలో ఉంది. దీని ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన అనేది జరుగుతుందని సమాచారం తెలుస్తోంది.క్లౌడ్‌ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించడం వల్ల దేశ జీడీపీకి 380 బిలియన్ డాలర్ల ఆదాయ అవకాశం ఉందని, 2026 వ సంవత్సరం నాటికి ఈ టెక్నాలజీ ద్వారా మొత్తం 1.4 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టి జరగే అవకాశం ఉందని నాస్కామ్ తాజా నివేదికలో వెల్లడించింది.ఇక ఈ విషయంలో వ్యాపారాలు ఇంకా అలాగే ప్రభుత్వం క్లౌడ్ స్వీకరణకు ఆలస్యం చేస్తే 2026 వ సంవత్సరం నాటికి భారత జీడీపీకి 118 బిలియన్ డాలర్లు ఇంకా 50 లక్షల ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా నాస్కామ్ హెచ్చరించింది.గ్లోబల్ ప్లేయర్‌లు.. 3D ప్రింటింగ్, IoT, రోబోటిక్ ఆటోమేషన్ ఇంకా క్లౌడ్‌లో స్లో లేదా తక్కువ అడాప్షన్ వంటి కొత్త సిస్టమ్‌ల వైపు పయనించడం వల్ల భారతీయ పరిశ్రమలు అనేవి పోటీతత్వాన్ని కోల్పోవచ్చు.


దీనివల్ల పెట్టుబడిదారులు ఇంకా కొత్త వ్యాపారాల్లో భారత్ తన ఆకర్షణను కోల్పోవచ్చని..'ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఇంపాక్ట్: ఇండియాకు అవకాశం' అనే పేరుతో రూపొందిచిన ఓ నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం ఉద్యోగుల రీ-స్కిల్లింగ్ ఇంకా అప్-స్కిల్లింగ్ అవసరమని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ వివరించారు.ఇక పరిపక్వ మార్కెట్లతో పోలిస్తే భారత్ ఇప్పటికీ క్లౌడ్ స్వీకరణ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్లౌడ్‌కు మారడం అనివార్యంగా మారింది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్లాట్‌ఫారమ్, సాఫ్ట్‌వేర్ ద్వారా దేశంలో వ్యాపారాలు ఇంకా ప్రభుత్వం తమ డిజిటలైజేషన్ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ ఇంకా ఆర్థిక సేవలు వంచి కీలక రంగాల్లో డిజిటలీకరణ వేగంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: