సూర్యనమస్కార ఆసనం ఎలా వేయాలో చూద్దాం... నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి. గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి.  మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చమోత్తాసనం అంటారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: