మూత్రపిండంలో రాళ్ళు  ప్రధానంగా ఈ కింది మూడు రసాయనాల మూలంగా ఏర్పుడుతాయి. 1. కాల్షియం ఆక్జటేట్ 2. యూరిక్ యాసిడ్ 3. ఫాస్పరస్  కిడ్నీలలో రాళ్ళు ఎక్కువగా కాల్షియం ఆక్జలేట్ మూలంగానే ఏర్పడుతుంటాయి. . మనం తినే ఆహారంలో ఆక్జేలేట్ అత్యధికంగా కూడుకుని వుండే ఆహారాలు, పాలకూర, టమాటాలు. పాలు, పాలసంబంధ ఆహారాలు, సోయాబీన్, బాదంపప్పులో కాల్షియం అధికంగా వుంటుంది.


ఇంతకు మునుపు మాత్రపిండాలలో రాళ్ళతో బాధపడి ఉన్నవాళ్ళు ఇప్పుడా రాళ్ళు పోయినా కూడా పాలు, పాలకూర, టమాటా వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే ఒకసారి మూత్రపిండాలలో రాళ్ళతో బాదపడిన వాళ్లకు అవి మళ్ళీమళ్ళీ రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.


అయితే మామూలు మనుషులు ఈ చెప్పిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల వచ్చే అపకారమేమి వుండదు. కేవలం ఇంతకు పూర్వం మూత్రపిండాలలో రాళ్లతో బాధపడినవారు కుటుంబ సభ్యలలో ఎవరికన్నా ఆ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రమే వీటి వాడకాన్ని తగ్గించాల్సివుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: