మహిళల్లో గర్భధారణ సమయంలో మధు మేహం బైటపడి ప్రసవానంతరం తగ్గిపోయినప్పటికీ, ఆ తరువాత కాలంలో వారికి మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే... మధుమేహ ప్రభావం మామూలు వ్యక్తుల్లోనూ, గర్భిణుల్లోనూ వేర్వేరుగా ఉంటుంది. గర్భంతో ఉన్న స్త్రీలు ప్రారంబంలో ప్రతి 3 వారాలకొకసారి. 6వ, నెల అనంతరం ప్రతి 15 రోజులకొకసారి తప్పని సరిగా ఆరోగ్య పరిస్థితిని పూర్తి స్థాయిలో పరీక్ష చేయించుకోవాలి. ప్రసూతి వైద్యురాలి సూచనలను తప్పక సూచనలను తప్పక పాటించాలి. గర్భిణీలకు వ్యాధి నియంత్రణలో ఇన్సులిన్ ఇంజక్షన్లను మాత్రమే వాడాలి. మాత్రలు ఉపయోగించరాదు. శిశువు పెరుగుతున్న కొద్దీ ఇన్సులలిన్ వాడకం అధికమౌతుంది. అత్యంత ముఖ్యవిషయం ఏమంటే మూత్రంలో ఎసిటోన్, రక్తపోటు, ఫైలోనెఫ్రయిటిస్ ఏర్పడకుండా వైద్యులచే క్రమంతప్పక పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ద వహిస్తే జన్మించిన బిడ్డకు గుండెజబ్బు, అధిక బరువు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు అధికం కావచ్చు. అలాగే మధుమేహం గలస్త్రీలు ఎక్కువ కాన్పులు ధరించిన కొద్దీ వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయి.  దీనిని జస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్బిణీ స్త్రీల ఆహార విషయంలో సైతం కొన్ని విషమాలను అనుసరించాలి. తీసుకునే ఆహారంలో ప్రతి కిలోకు 50 శాతం క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. అలాగే 50 శాతం క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. అలాగే 50 శాతం కార్బోహైడ్రేట్లు, 20 శాతం మాంసకృత్తులు, 30 శాతం కొవ్వు పధార్థాలుండేలా ఆహార పధార్థాలు తయారు చేసుకోవాలి. మధుమేహంతో ఉన్న గర్భిణులు కడుపులోని శిశువు ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు తాము తీసుకొనే ఆహారంలో రోజుకు కనీసం 350 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. శిశువు పెరుగుదలకు అలాంటి ఆహారం బాగా ఉపకరిస్తుంది. అయితే.., గర్భిణులు బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: