ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలో థైరాయిడ్ సమస్య ఒకటని చెప్పవచ్చు. ఈ థైరాయిడ్ బారిన పడి ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ గ్రంధి మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం అని చెప్పవచ్చు. థైరాయిడ్ గ్రంధి నుంచి విడుదలయ్యే ట్రైయోడోథైరోనిన్, థైరాక్సిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడటంలో,శారీరక పెరుగుదలతో పాటు మన శరీరంలో జరిగే కొన్ని ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.                  

కొన్ని సార్లు మన శరీరంలో థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయనప్పుడు అది హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ఈ విధంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి వాటికి దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంధి మన శరీరానికి కావలసినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకుండా బలహీనపడటాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ సమస్య సాధారణంగా పురుషులలో కన్నా స్త్రీలలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ సమస్య వల్ల స్త్రీలు అమాంతం బరువు పెరగడం, మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం, దృష్టి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.

థైరాయిడ్ గ్రంధి హార్మోనుల సమతుల్యతను నియంత్రించడానికి ఎన్నో చికిత్సా మార్గాలు ఉన్నాయి. అయితే ఈ థైరాయిడ్ గ్రంధి చికిత్సకు సహజంగా కొత్తిమీరను,కొత్తిమిర నీటిని ఎన్నో సంవత్సరాలుగా ఆయుర్వేదంలో థైరాయిడ్ అసమతుల్యతకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీర, ధనియాలులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు సహజంగానే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి సహకరిస్తాయని చెప్పవచ్చు. థైరాయిడ్ గ్రంథి సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు రాత్రి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు లేదా కొత్తిమీరను రాత్రంతా గ్లాసు నీటిలో నానబెట్టిన తరువాత ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: