జీలకర్ర అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని పోపు పెట్టడానికి ఉపయోగిస్తామని అందరికీ తెలుసు. మనము వివాహ సమయంలో జీలకర్ర బెల్లము తలపై  పెట్టడం చూస్తూ ఉంటాం. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా జీలకర్రను తినడం వల్ల  బరువు తగ్గుతారు. జీర్ణ క్రియ  సక్రమంగా జరిగేటట్లు జీలకర్ర సహాయపడుతుంది. మలబద్దక  సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా జీలకర్రను వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జిలకర అన్నం ఎలా వాడాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.                                                     

 అజీర్తితో బాధపడుతున్న వాళ్లు, గ్యాస్, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు. జీలకర్రను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 2  గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరగనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత  ఉదయం లేవగానే పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల పై సమస్యలన్నీ తగ్గుతాయి.

 వాంతులు  అవుతున్నప్పుడు జీలకర్రను వేయించి అందులో సైంధవ లవణం కలిపి ఈ రెండింటిని బాగా పొడిచేయాలి. ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు. వాంతులు  అవుతున్నప్పుడు కొంచెం తీసుకోవడం వల్ల తగ్గుతాయి.

 జీలకర్ర, తేనె,ఉప్పు, నెయ్యి అన్నింటినీ కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట పెట్టడం వల్ల విషాన్ని హరించిన.

 జీలకర్రను నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల తల  తిప్పడం, కడుపులో వేడి, పైత్య రోగములు తగ్గును. దీనిని  ఉదయం,  సాయంత్రం పూట తీసుకోవాలి.

 నీరసం తగ్గుటకు జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను, ధనియాలు కలిపి మెత్తగా  నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల నీరసం లేకుండా పోతుంది.

 జీలకర్రను కషాయంగా చేసుకొని తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా బిపి, షుగర్ కంట్రోల్లో  ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: