చాల మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొంత మంది ఆరోగ్యాంగా ఉండటం కోసం గ్రీన్ టీని తాగుతుంటారు. అయితే అంతేకాకుండా.. రోజూలో ఎక్కువసార్లు టీని తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే సాధరణంగా భోజనం తర్వాత అసలు గ్రీన్ టీ తీసుకోవద్దు. భోజనం చేసిన వెంటనే.. ఆహారం జీర్ణం కాదు. అలాగే ఆహారంలోని ప్రోటీన్లు శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగకూడదు. గ్రీన్ టీ మరీ వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు. వేడిగా ఉన్నప్పుడు తాగితే.. రుచిగా అనిపించదు. అలాగే.. మీ పొట్టను, గొంతును దెబ్బతీస్తుంది. అందుకే గ్రీన్ టీ కాస్తా చల్లారిన తర్వాత తాగడం మంచిది.

ఇక చాలా మందికి గ్రీన్ టీ ఉదయం లేవగానే తాగే అలవాటు ఉంటుంది. అలా చేయడం అసలు మంచిది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉండడం వలన.. ఖాళీ కడుపుతో దీనిని తాగితే.. కడుపులో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. అలాగే జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.

అంతేకాదు.. గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడు అసలు తేనే కలపకూడదు. చాలా మంది చక్కెరకు బదులుగా తేనే యాడ్ చేస్తుంటారు. వేడిగా ఉన్నప్పుడు తేనే కలిపితే.. అందులోని పోషక విలువలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గ్రీన్ టీ కాస్త్ చల్లారిన తర్వాత దాల్చిన చెక్క, తేనే కలపడం ఉత్తమం.  చాలా మంది గ్రీన్ టీ తాగుతూ… మందులు వేసుకుంటారు. అయితే గ్రీన్ టీతో కలిపి మందులు వేసుకోవడం వలన యాసిడిటీకి దారి తీస్తుంది. అందుకే ట్యాబ్లెట్స్‏ను నీటితో మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీని హడావిడిగా తాగకూడదు. ఆఫీసుకు వెళ్ళే సమయంలో టీ తాగకూడదు. దీనివలన మెదడు చురుకుగా ఉండదు. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: