దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ డామినేషన్ కన్నా.. ప్రధాని మోదీ హవానే ఎక్కువగా కనిపిస్తోంది.  మన దగ్గర ఐదేళ్లు పరిపాలిస్తేనే ప్రజా వ్యతిరేకత సహజంగా  వ్యక్తం అవుతుంది.  కానీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా బీజేపీ ప్రభావం.. మోదీ చరిష్మా ఏం మాత్రం తగ్గలేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.


అందుకే ఈ సారి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి మాత్రమే సాధ్యమైన రికార్డును ఈ ఎన్నికల్లో గెలిస్తే మోదీ తిరగరాయనున్నారు. అదేంటంటే వరుసగా మూడు ఎన్నికల్లో గెలవడంతో పాటు ప్రతి ఎన్నికల్లోను ఓట్లు, సీట్లు పెంచుకుంటూ పోవడం. ఇది జవహర్ లాల్ నెహ్రూకి తప్ప వేరేవరకి సాధ్యం కాలేదు. ఒకవేళ బీజేపీ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంది.


1984 ఎన్నికల్లో కాంగ్రెస్ 400కి పైగా సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఆ రికార్డును మోదీ బద్ధలు కొడతారా లేదా అనేది చూడాలి. కానీ ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తోంది. ఆ తర్వాత నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోను హస్తం పార్టీ పతనం అవుతూ వచ్చింది.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 190 సీట్లకే పరిమితం అయింది.


అందువల్ల ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచినా.. తర్వాత ఎన్నికల్లో ఇంతే స్థాయిలో గెలుస్తుందనే నమ్మకం లేదు. అందుకే ఆ పార్టీ సీట్లు, ఓట్లను మాత్రమే అడగడం లేదు. సహజంగా కాంగ్రెస్ కానీ.. ఇతర పార్టీలు కానీ తాము  చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయమని అడుగుతారు. అధికారాన్ని ఇవ్వాలని కోరతారు. కానీ ఈసారి ప్రధాని మోదీ ఓట్లు, సీట్లతో పాటు ప్రజల మద్ధతును అడుగుతున్నారు. తన ఆలోచనలకు ప్రజల నుంచి స్పందన కావాలని  కోరుతున్నారు. మరి ఇది ఏ మేర విజయవంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: