ప్రకృతిలో మనకు లభించే ప్రతి మొక్కలను ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది. కానీ ఆ మొక్క యొక్క ఉపయోగం మనలో చాలామందికి తెలియక పోవడం వల్ల వాటిని పిచ్చిమొక్కలు గా పరిగణించి పీకి పడేస్తున్నాము. ఇక అందుకు తగ్గట్టుగానే  ప్రస్తుతం సమాజంలో అన్నీ కలుషితం అవుతున్న విషయం తెలిసిందే. అందుకే మనం చిన్న వయసులోనే ఎన్నో తెలియని అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాం. అలాంటి ఆరోగ్య సమస్యలలో ఒకటి కిడ్నీలలో రాళ్లు. ఆ రాళ్లను కరిగించడానికి మనము డాక్టర్లను సంప్రదిస్తూనే ఉంటాం. అయితే అంతటి స్తోమత లేని వాళ్లకు ఇప్పుడు చెప్పబోయే ఆకు వల్ల కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.


పూర్వం నుండి చెట్ల మందులు ఆలస్యంగానైనా సమర్థవంతంగా పని చేస్తాయని కొంతమంది నిపుణులు చెబుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు ద్వారా కేవలం చిన్న సైజు రాళ్ల గల పరిమాణంలో ఉన్న కిడ్నీలోని రాళ్లను ఈ  ఆకు రసం తాగడం వల్ల నయం చేయవచ్చు.

ఈ రసాన్ని ఎలా సేవించాలి అంటే, ఉదయం పూట పరగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని, బాగా దంచిన తర్వాత , వచ్చే రసాన్ని ఒక గ్లాసు లో వేసుకొని, అందులోకి జిలకర, పటిక బెల్లం ( పొడిగా తయారు చేసుకొని) కొండపిండి రసంలో కలుపుకొని , కనీసం వారం అయినా సేవిస్తే 15 రోజులకి  రాళ్లు కరిగిపోవడం జరుగుతుంది.

ఒక వారం కన్నా ఎక్కువ రోజులు తాగితే దీని వల్ల ప్రమాదం ఉండదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ రసం తాగడం వల్ల చాలామందిలో  కిడ్నీలో  ఉండే రాళ్ళు పడిపోవడం, కరిగిపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా కొండపిండి ఆకు ను కూర ఫ్రై గా చేసుకొని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరికీ అందుబాటులో ఉంటూ, ఎటువంటి ఖర్చు లేకుండా సహజంగా దొరికే ఈ కొండపిండి ఆకు ను తెచ్చుకొని , ఎవరైనా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటే దీని రసాన్ని సేవించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: