ప్రకృతిలో దొరికేటువంటి మొక్కలు ఎంతో విలువైనవి.. అంతే కాకుండా వాటి నుంచి ఎన్నో ప్రయోజనాలు మనకి కలుగుతూనే వుంటాయి. ప్రకృతిలో 90 శాతం వరకు మనకు అన్ని పనికొచ్చే మొక్కలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలు అని పీకి వేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఈ నేలఉసిరి కూడా ఒకటి. ఈ మొక్క ఎన్నో మందులలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క నుంచి వెలువడిన ఎటువంటి పదార్థం అయినా కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందట.అయితే ఈ మొక్క గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

1). నేల ఉసిరి చెట్టు మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో ఇమ్యూనిటీపవర్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్కను జ్యూస్ గా తీసుకొని తాగడం వలన, కడుపులో మంటను నివారిస్తుంది.

2). అంతేకాకుండా మల మూత్ర ఇన్ఫెక్షన్, చర్మం మీద దురద, గజ్జి వంటి వాటికి ఎంతో దివ్యౌషధంగా పనిచేస్తుంది.

3). శరీరంలో ఉండేటువంటి ఎసిడిటీ ని నివారించడానికి మంచి గా పనిచేస్తుంది. దీంతో కాలేయ పనితీరు బాగా పనిచేస్తుంది.

4). ముఖ్యంగా కామెర్ల వ్యాధి నుంచి మనిషిని కాపాడేందుకు, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

5). కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఖాళీ కడుపుతో ఈ చెట్టు యొక్క రసం తాగితే.. ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

6). షుగర్ ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రించడానికి తగిన సహాయం చేస్తుంది.

7). ఈ చెట్టుకు ఉండే బెరడు వలన మూత్ర విసర్జన, డయాబెటిస్, కాలేయ  సమస్యల నుండి బయటపడడానికి ఎంతో సహాయపడుతుంది.

ఇన్ని ఔషధ మొక్కలు కలిగి ఉన్న ఈ మొక్కను మనం ప్రతిరోజు చూసి,  పనికిరాని మొక్కగా పీకి పారేస్తూ ఉంటాం. అందుకే ఏ మొక్క నైనా పీకిపారేసేటప్పుడు అందులో ఉన్న ఔషధ గుణాలు ఏంటో తెలుసుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: